• తాజా వార్తలు

రెడ్ మీ డబుల్ ధమాకా తెలుసా మీకు

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు షియోమీ రెండు కొత్త ఫోన్లను అందుబాటులోకి తెస్తోంది. అందులో ఒకటైన ఎంఐ 5ని ఈ నెల 31వ తేదీన గురువారం భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి. వాటి ధరలు... రూ.21వేలు, రూ.24వేలు, రూ.28వేలుగా ఉండనున్నాయి.

ఇవీ స్పెసిఫికేషన్లు..

  •  డ్యుయల్ సిమ్, 5.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 3డీ సెరామిక్ గ్లాస్ డిస్‌ప్లే
  •  1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  •  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్
  •  అడ్రినో 530 గ్రాఫిక్సు
  •  16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  •  4 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  •  3000 ఎంఏహెచ్ బ్యాటరీ
  •  క్వాల్‌కామ్ క్విక్‌చార్జ్ 3.0, యూఎస్‌బీ ఓటీజీ
  •  బ్లూటూత్ 4.2, 4జీ, యూఎస్‌బీ టైప్-సి, ఎన్‌ఎఫ్‌సీ

కాగా రెడ్‌మీ 3 ప్రొ పేరుతో మరో మోడల్ ను కూడా  త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. రూ.9వేల ధరకు ఇది అందుబాటులోకి రానుంది.

రెడ్ మీ 3 ప్రో ఫీచర్లు ఇలా...

  •  5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సళ్ల స్క్రీన్ రిజల్యూషన్
  •  1.2 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్
  •  3 జీబీ ర్యామ్, అడ్రినో 405 గ్రాఫిక్సు
  •  32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
  •  4100 ఎంఏహెచ్ బ్యాటరీ
  •  13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  •  5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  •  డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ

జన రంజకమైన వార్తలు