వాచ్ అంటే చాలా మందికి మోజు ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాచ్‌లను ట్రై చేస్తూ ఉంటారు వాచ్ ప్రియులు. అయితే టెక్నాలజీ పెరిగాక స్మార్ట్‌వాచ్‌ల హవా కూడా పెరిగింది. ఎక్కువమంది స్మార్ట్‌వాచ్‌లు వాడకంపైనే దృష్టి పెడుతున్నారు. అధునాతన ఫీచర్లు ఉన్నా వాచ్‌ల గురించే ఎక్కువ అన్వేషిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వాచ్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది అదే డీజిల్ ఆన్ హైబ్రీడ్ వాచ్. మంచి ఫీచర్లతో రంగంలోకి దిగిన ఈ వాచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేస్తుంది
డీజిల్ ఆన్ హైబ్రీడ్ కేవలం టైమ్ చూపించే వాచ్ మాత్రమే కాదు. అంతకుమించి మీకు పనులు చేసి పెట్టే యంత్రం. డీజిల్ ఆన్ హైబ్రీడ్ రిస్ట్‌వాచ్ సమయం చూపించడమే కాదు బ్లూ టూత్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేస్తుంది. మీ ఫోన్‌కు ఏమైనా నోటిఫికేషన్లు వస్తే మీ రిస్ట్‌వాచ్ వైబ్రేట్ అవుతుంది. డీజీల్ ఆన్ హైబ్రీడ్ ఫ్యాషన్ బ్రాండ్‌గా మారే అవకాశాలున్నాయి. అమెరికా వాచ్ తయారీ కంపెనీ ఫొజిల్ తయారు చేసిన ఈ వాచ్ ప్రస్తుతం మార్కెట్లో హాట్ హాట్. స్లిమ్ రిస్ట్ వాచ్‌లు కోరుకునే అబ్బాయిలకు ఇది ఫర్‌ఫెక్ట్. దీనికి ఉండే లెదర్ స్ట్రాప్ ధరించడానికి చాలా సౌలభ్యంగా ఉంటుంది.
మిమ్మల్ని గమనిస్తుంది
డీజీల్ ఆన్ వాచ్ ఇంకా ఎన్నో పనులు చేసి పెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మనకో పర్సనల్ అసిస్టెంట్‌గా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే అలారం మోతతో నిద్ర లేపడమే కాదు. మనం ఎంత సౌండ్ స్లీప్‌గా నిద్రపోపోయామో... మనం రోజుకు ఎన్ని అడుగులు వేశామో కూడా ఇది లెక్కలు వేస్తుంది. దీనిలో రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి రెడ్ బటన్. ఇది మీ ఫోన్‌లో జరిగే యాక్టివిటీస్ గురించి మీకు తెలియజేస్తుంది. ఈ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఫొటోలు కూడా తీసుకోవచ్చు. అంతేకాదు మ్యూజిక్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం లాంటివి కూడా దీనితో సాధ్యం. మొత్తం మీద ఈ రిస్ట్‌వాచ్ మీకు ఒక యాక్టివిటీ ట్రాకర్‌గా ఉపయోగపడుతుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండింట్లో ఉపయోగపడడం దీని ప్రత్యేకత.