• తాజా వార్తలు

డ్యూయల్ కెమెరా ఫోన్ ల విషయం లో జరుగుతుంది హైప్ మాత్రమేనా? వాస్తవాలెంత శాతం?

టెక్నాలజీ అనేది నిరంతరం అప్ డేట్ అవుతూ ఉంటుంది అనే విషయం మనకు తెలిసినదే. నిరంతరం టెక్నాలజీ లో అనేక రకాల మార్పులు మరియు వినూత్న ఆవిష్కరణలు చోటు చేసుకుంటూ ఉంటాయి. స్మార్ట్ ఫోన్ ల విషయం లో అయితే ఈ మార్పులు కొంచెం హెచ్చు స్థాయి లోనే ఉంటున్న విషయాన్ని కూడా మనం గమనిస్తూనే ఉన్నాము. బేసిక్ కాలింగ్ ఫీచర్ లు ఉన్న సింపుల్ ఫోన్ లనుండీ అద్భుతమైన ఫీచర్ లను మరియు బిల్ట్ ఇన్ కెమెరా లను కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్ ల వరకూ ఈ ఆవిష్కరణలు మనం చూస్తున్నాం. కెమెరా టెక్నాలజీ ఇంకా బెటర్ గా ఉంటె బాగుండు అని మనం అనుకుంటూ ఉండగానే ప్రస్తుత స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో డ్యూయల్ కెమెరా ఫోన్ లు హల చల్ చేస్తున్నాయి. మొబైల్ ఫోన్ ల విషయం లో ఇది సరికొత్త టెక్నాలజీ కాబట్టి సహజం గానీ సింగల్ కెమెరా ఫోన్ ల కంటే ఇవి ఏ రకంగా గొప్పవి అనే ప్రశ్న ఉద్బవిస్తుంది.  ఈ నేపథ్యం లో అసలు ఈ డ్యూయల్ కెమెరా ఫోన్ లలో ఉండే ఫీచర్ లు ఏమిటి? ఇవి ఎలా పని చేస్తాయి? తదితర విషయాలను ఈ వ్యాసం లో చర్చిద్దాం.

ఈ డ్యూయల్ కెమెరా ఫోన్ ఎలా ఉంటుంది?

ఈ డ్యూయల్ కెమెరా ఫోన్ లలో రెండు రేర్ కెమెరా లు ఉంటాయి. ఈ రెండింటిలో ఒకటి ప్రైమరీ కెమెరా కాగా రెండవది సెకండరీ కెమెరా గా పనిచేస్తాయి. ఈ రెండు కెమెరా ల ద్వారా తీసిన పిక్చర్ లు మరింత డైనమిక్ గానూ మరింత ఇంటెన్స్ గానూ ఉంటాయి. ఏవైనా చిన్న చిన్న అంశాలను కూడా ఇవి కవర్ చేస్తాయి. ఒకవేళ ఈ విషయం లో ఒక కెమెరా ఫెయిల్ అయినా సరే మరొక కెమెరా ఆ పనిని చేస్తుంది.స్వల్ప మైన అదనపు ఫీచర్ లతో కూడి ఉండే ప్రైమరీ కెమెరా మామూలు ఫోన్ కెమెరా కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది.

సెకండరీ కెమెరా ; ది గేమ్ చేంజర్

పిక్చర్ లను మరింత అందంగా మరియు క్లారిటీ తో మరియు వేగవంత మైన ఫోకస్ తో లభిస్తుంది. ఈ రకమైన సెకండరీ కెమెరా అనేది ఫోన్ యొక్క  తయారీదారుని పై ఆధార పడి ఉంటుంది. అంటే కొన్ని వైడ్ యాంగిల్ద్ లెన్స్ ను కలిగి ఉంటాయి. కొన్ని టెలి ఫోటో లెన్స్ ను కలిగి ఉంటాయి మరికొన్ని  సింపుల్ మోనో క్రోమో లెన్స్ ను కలిగి ఉంటాయి.

ఈ మోనో క్రోమాటిక్ లెన్స్ యొక్క ఇంటెంట్ అనేది కేవలం బ్లాక్ అండ్ వైట్ సీన్ లను క్యాప్చర్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఫోకస్ పాయింట్ వైపు వచ్చే లైట్ ను క్రమబద్దీకరించడానికి తద్వారా ఒక షార్ప్ పిక్చర్ తీయడానికి ఇది ఉపయోగపడుతుంది. మరొక పక్క RGB కెమెరా తన పని తానూ సీరియస్ గా చేసుకుపోతుంది. పిక్చర్ ను క్యాప్చర్ చేసేటపుడు ఏ రంగు ఎక్కడ ఉండాలి, ఇమేజ్ యొక్క దూరాన్ని బట్టి అది ఎంత స్పష్టంగా ఉండాలి అనే అంశాలను ఈ లెన్స్ ఫిల్టర్ చేస్తాయి.

జూమ్ ఎఫెక్ట్ కు వచ్చేసరికి ఇవి వేరువేరు గా పనిచేస్తాయి. ఈ లెన్స్ లు బ్యాక్ గ్రౌండ్ డీటెయిల్స్ ను ఎక్కువ క్యాప్చర్ చేస్తాయి, దీనివలన ఎక్కువ దూరం లో ఉండే ఇమేజ్ కూడా మరింత ఇంటెన్స్ గా కనిపిస్తుంది.

ఈ సెట్ అప్ లు స్మార్ట్ ఫోన్ లలో ఎలా పనిచేస్తాయో చూద్దాం.

హువాయి ఆనర్ P9- RGB&మోనో క్రోమ్ కెమెరా

ఈ ఆనర్ P9 అనే ఫోన్ RGB మరియు మోనో క్రోమ్ కెమెరా ల కాంబినేషన్ లో వస్తుంది. ఇందులో ఈ రెండూ అద్భుతంగా పనిచేస్తాయి. పిక్చర్ లో ఏ రంగు ఎంత శాతం లో ఉండాలి అనే దానిని RGB కెమెరా బందిస్తే ప్రతీ చిన్న విషయాన్నీ మోనో క్రోమ్ కెమెరా బందిస్తుంది. ఈ రెండు ఇలా పనిచేయడం వలన ఈ ఫోన్ తో తీసే ఫోటో లు అద్భుతమైన క్వాలిటీ తో వస్తాయి.

ప్రత్యేకించి ఈ సెట్ అప్ అనేది ఎక్కువ సన్ లైట్ లోనూ మరియు లో లైట్ ఫోటోగ్రఫి లోనూ ఉపయోగపడుతుంది.

ఐ ఫోన్ 7 ప్లస్ – ఆప్టికల్ జూమ్ అడ్వాంటేజ్

పై ఫోన్ తో పోల్చుకుంటే ఇందులో ఒక పూర్తీ స్థాయి భిన్నమైన సెట్ అప్ ఉంటుంది. ఇది 28 mm వైడ్ యాంగిల్ద్ లెన్స్ ప్రైమరీ కెమెరా లోనూ మరియు 56mm టెలిఫోటోలెన్స్ సెకండరీ కెమెరా లోనూ కలిగి ఉంటుంది. ఎక్కువదూరం లో ఉండే ఫోటో లను జూమ్ మోడ్ లో కూడా అత్యంత స్పష్టంగా క్య్యాప్చర్  చేయడం లో ఇవి సహాయపడతాయి.

LG వైడ్ యాంగిల్ అడ్వాంటేజ్

ఈ ఫోన్ లో ఒక వైడ్ యాంగిల్ద్ సెకండరీ కెమెరా ఉంటుంది. ఇది విశాలమైన ఏరియా ను కూడా మీ లెన్స్ లో బందిస్తుంది.ఇందువలన మీకు పనోరమా మోడ్ ను ఉపయోగించవలసిన అవసరం ఉండదు.ఇందులో ఉండే ఫీల్డ్ అఫ్ వ్యూ 135 వైడ్ యాంగిల్ అనేది ఇప్పటివరకూ ఏ ఫోన్ లో కూడా రాలేదు.

మొత్తం మీద చూసుకుంటే ప్రైమరీ కెమెరా అనేది పిక్చర్ క్వాలిటీ ని ప్రభావితం చేస్తుంది. సెకండరీ కెమెరా మెరుగైన ఎఫెక్ట్ లను అందిస్తుంది.

 

జన రంజకమైన వార్తలు