రిలయన్స్ జియో యొక్క రాకతో భారత టెలికాం రంగం లో చోటుచేసుకుంటున్న కొన్ని విప్లవాత్మక మార్పులను మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. ఈ జియో అనేది భారతదేశం లోని 4 జి సేవలను ఒక కుదుపు లాగా మారడమే గాక మిగతా టెలికాం ఆపరేటర్ లందరికీ సవాలుగా మారింది. దీని దెబ్బకు తట్టుకొని నిలవాలంటే ఆకర్షణీయమైన ఆఫర్ లను ప్రకటించడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితిని సృష్టించింది. ఈ నేపథ్యం లో ఇండియా లోని టాప్ టెలికాం ఆపరేటర్ లు అయిన భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఇండియా , ఐడియా సెల్యూలర్ లు తమ డేటా ప్యాక్ ల యొక్క ధరలను గణనీయంగా తగ్గించి ఆకర్షణీయమైన ఆఫర్ లను ప్రకటించాయి. ఈ మధ్య కాలం లో అయితే అవి తమ పాత ఆఫర్ లను పూర్తిగా మార్చివేసి సరికొత్త ఆఫర్ లను ప్రకటించాయి. ఇదంతా జియో ప్రభావమే కదా!
అయితే 1 GB డేటా ప్యాక్ తో రీఛార్జి చేయడం అంటే అది కొంచెం ఖరీదైన పనిలానే కనిపిస్తుంది. జియో యొక్క ప్రాథమిక ప్యాక్ అయిన రూ 149/- రీఛార్జి తో 300 MB 4 జి డేటా లభిస్తూ ఉండగా భారతి ఎయిర్ టెల్ 1 GB డేటా ను రూ 255 లకు అందిస్తుంది. జియోతో పోలిస్తే ఈ విషయంలో ఎయిర్ టెల్ ఉత్తమం గా కనిపిస్తుంది. పైగా ఇది 28 రోజుల వ్యాలిడిటీ లో లభిస్తుంది.అదే వోడాఫోన్ విషయానికొస్తే ఇది 1 GB 4 జి డేటా ను రూ 251/- లకే 28 రోజుల వ్యాలిడిటీ తో అందిస్తుంది. అయితే ఇండియా లోని చాలా సర్కిల్ లలో వోడాఫోన్ యొక్క 4 జి సేవలు అందుబాటులో లేవు. ఇలాంటి చోట ఇది 3 జి ని అందిస్తుంది.
ఇండియా లోని మూడవ అతిపెద్ద టెలికాం నెట్ వర్క్ అయిన ఐడియా సెల్యూలర్ 1 GB 3 జి/4 జి డేటా ను రూ 296/- లకు అందిస్తుంది. ఇది కూడా 28 రోజుల వ్యాలిడిటీ తో లభిస్తుంది. ఇవి కాక ముకేష్ అంబానీ సోదరరుడు అయిన అనిల్ అంబానీ యొక్క సంస్థ అయిన RCom కూడా 4 జి సేవలను అందిస్తుంది. ఇది 1 GB 4 జి డేటా ను రూ 259/- లకు అందిస్తుంది.
ఇవన్నీ చూసుకుంటే ఎయిర్ టెల్ ఉత్తమ మైన 4 జి ప్లాన్ ను అందిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే జియో లో 300 MB రూ 149 ఉండగా 1 GB అంటే సుమారు దీనికి మూడురెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇలా చూసుకున్నా జియో కంటే ఎయిర్ టెల్ యొక్క ప్లాన్ లే తక్కువ ధరలో లభిస్తున్నాయి. అయితే మార్చ్ 31 తర్వాత రిలయన్స్ జియో యొక్క ఉచిత ఆఫర్ ముగుస్తూ ఉండడం తో ఆ తర్వాత జియో తన రేటు లను మరింత తగ్గించనుండి.
గమనిక:- ప్రతీ టెలికాం ఆపరేటర్ యొక్క ఈ ప్లాన్ లు అనేవి ఒక్కో రాష్ట్రానికీ ఒక్కో రకంగా ఉంటాయి.ఈ తేడా అనేది రూ 1 నుండీ రూ 6 వరకూ ఉండవచ్చు.