• తాజా వార్తలు

ఇప్పుడు రైతులకు వ్యవసాయ పరికరాలు అద్దెకు తెచ్చుకోవడం ఒక్క క్లిక్ దూరంలో- గోల్డ్ ఫార్మ్ యాప్

ఇప్పుడు రైతులకు వ్యవసాయ పరికరాలు అద్దెకు తెచ్చుకోవడం ఒక్క క్లిక్ దూరంలో
- గోల్డ్ ఫార్మ్ యాప్
 

నేటి స్మార్ట్ ఫోన్ ప్రపంచం లో మొబైల్ యాప్ లు మానవ జీవన శైలి ని ఎంతగా ప్రభావితం చేశాయో మనకు తెలియనది కాదు. దాదాపు అన్ని రంగాల లోనూ ఈ మొబైల్ యాప్ ల విస్తృతి పెరిగి పోయింది. సరికొత్త మొబైల్ యాప్ ల గురించి ఎప్పటికప్పుడు కంప్యూటర్ విజ్ఞానం పాఠకులకు చేరవేసే ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము. ఈ మధ్యనే జాలరులకు ఉపయోగపడే  ఫిషర్ ఫ్రెండ్లీ యాప్ గురించి మనం చదువుకున్నాం. అది మరువక ముందే రైతులకు ఉపయోగపడే మరొక యాప్ వచ్చేసింది. అదే గోల్డ్ ఫార్మ్.

కోయంబత్తూర్ కి చెందిన AK సూర్యా పవర్  మేజిక్ అనే కంపెనీ ఈ యాప్ ను లాంచ్ చేసింది. రైతులకు వ్యవసాయానికి అవసరమయ్యే అన్ని రకాల పరికరాలు ఈ యాప్ ద్వారా అద్దెకు లభిస్తాయి. మొదటగా ఈ ప్రయోగాత్మకం గా ఈ యాప్ కర్ణాటక లో లభిస్తుంది. ఆ తర్వాత నిదానంగా దక్షిణ భారత దేశం లోని మిగతా రాష్ట్రాల లోనూ ప్రవేశ పెడతారు. రానున్న 6 నెలల్లో దక్షిణాది రాష్ట్రాల్లో 2500 రకాల వ్యవసాయ పరికరాలను ఈ యాప్ ద్వారా అందుబాటులోనికి తీసుకురావాలని ఈ కంపెనీ లక్ష్యం గా పెట్టుకుంది.

ప్రస్తుతానికి మా దగ్గర 65 ట్రాక్టర్ లూ, 50 వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఆగష్టు 16 వ తేదీ నుండి కర్ణాటక లోని కోలార్ మరియు గదగ్ జిల్లాల్లో వీటిని మా యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతున్నాం. రైతులను దృష్టి లో ఉంచుకొని ఈ విశిష్టమైన మొబైల్ యాప్ ను డిజైన్ చేయడం జరిగింది. దీని వలన నాలుగు రాష్ట్రాల లోని 6 నుండీ 8 లక్షల మంది రైతులకు ప్రత్యక్షంగా లబ్ది చేకూరుతుంది. ఇప్పటివరకూ నాలుగు రాష్ట్రాల లో15 వే ఎకరాలకు సరిపడా ట్రాక్టర్ లను సరఫరా చేశాము. భవిష్యత్ లో దీనిని ఉత్తరాది రాష్ట్రాలకు కూడా విస్తరించే యోచనలో ఉన్నాం. రానున్న ఐదేళ్ళలో మరో 50 లక్షల మంది రైతులకు ఉపయోగపడాలని లక్ష్యం గా పెట్టుకున్నాం.” అని ఈ సంస్థ డైరెక్టర్ మరియు సహా వ్యవస్థాపకుడు అయిన కార్తీక్ రవీంద్రనాథ్ చెప్పారు.

 

జన రంజకమైన వార్తలు