• తాజా వార్తలు

ఫ‌స్ట్ డే ఇన్ మొబైల్‌ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్, జడ్‌టీఈ నుంచి 5జీ ఫోన్‌. మోటో జీ5, ప్లస్.., ప్లస్.. హువావే

స్పెయిన్‌లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2017 ప్రదర్శన అట్ట‌హాసంగా సాగుతోంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్, సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థలు పాల్గొంటున్నాయి. ప్రదర్శనలో భాగంగా ఇప్పటికే నోకియా, ఎల్‌జీ, శాంసంగ్ వంటి ప్రముఖ కంపెనీలు తమ తమ ఉత్పత్తులను విడుదల చేశాయి. 3310 ఫీచర్ ఫోన్‌తోపాటు నోకియా 3, 5, 6 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయగా ఈ ఫోన్లు వరుసగా రూ.3500, రూ.9,780, రూ.13,300, రూ.16,117 ధరలకు వినియోగదారులకు లభ్యమవుతున్నాయి. ఇక బ్లాక్‌బెర్రీ కీ వన్ ఫోన్‌ను, హువావే పీ10, పీ10 ప్లస్ ఫోన్లను విడుదల చేశాయి. ఇవి వరుసగా రూ.36,590, రూ.45,675, రూ.49,195 ధరలకు లభ్యమవుతున్నాయి. హువావే సంస్థ ఈ ఫోన్లతోపాటు వాచ్ 2, వాచ్ 2 క్లాసిక్ పేరిట రెండు నూతన ఆండ్రాయిడ్ వేర్ 2.0 స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. ఇవి రూ.23వేలు, రూ.28వేల ధరలకు లభించనున్నాయి.
 తొలిరోజున హెచ్‌పీ సంస్థ ప్రొ ఎక్స్2 612 జీ2 పేరిట ఓ నూతన ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఇది రూ.65,238 ధరకు లభిస్తోంది. మోటోరోలా మోటో జీ5, జీ5 ప్లస్ ఫోన్లను విడుదల చేయగా అవి రూ.14,005, రూ.15,260 ప్రారంభ ధరలకు లభిస్తున్నాయి. గెలాక్సీ ట్యాబ్ ఎస్3 పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను శాంసంగ్ విడుదల చేసింది. ఇదే కాకుండా గెలాక్సీ బుక్ పేరిట ఓ నూతన విండోస్ 10 టాబ్లెట్‌ను కూడా ఈ కంపెనీ విడుదల చేసింది. ఈ టాబ్లెట్ల్ల ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఓ నూతన గేర్ వీఆర్ హెడ్‌సెట్ ను కూడా శాంసంగ్ విడుదల చేసింది. ధర ప్ర‌క‌టించ‌లేదు. దీంతో పాటు ఆ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేయనున్న ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్‌ల విడుదల తేదీని కూడా ప్రకటించింది. మార్చి 29వ తేదీన న్యూయార్క్‌లో ఈ ఫోన్లను శాంసంగ్ విడుదల చేయనుంది.
 ఎల్‌జీ సంస్థ తన నూతన ఫ్లాగ్‌షిప్ ఫోన్ జీ6ను విడుదల చేసింది. కానీ ధర వివరాలను వెల్లడించలేదు. మిక్స్ 320 కన్వర్టబుల్ ల్యాప్‌టాప్‌ను లెనోవో విడుదల చేసింది. మిక్స్ 310 ల్యాప్‌టాప్‌కు కొనసాగింపు సిరీస్‌గా దీన్ని లెనోవో ఆవిష్కరించింది. ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. దీంతోపాటు 13, 14 ఇంచ్ వేరియెంట్లలో యోగా 520 ల్యాప్‌టాప్‌ను కూడా లెనోవో విడుదల చేసింది. ఇది రూ.42,238 ప్రారంభ ధరకు లభ్యమవుతోంది. సోనీ సంస్థ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ1 అల్ట్రా ఫోన్‌ను విడుదల చేయగా దీని ధరను ప్రకటించలేదు.
 జడ్‌టీఈ నుంచి 5జీ ఫోన్‌..
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ప్రదర్శనలో భాగంగా జడ్‌టీఈ సంస్థ 5జీ ఫోన్‌ను ప్రదర్శించింది. 'గిగాబిట్' అనే పేరిట జడ్‌టీఈ ప్రదర్శించిన ఆ ఫోన్‌లో 1 జీబీపీఎస్ గరిష్ట ఇంటర్నెట్ స్పీడ్ నమోదైంది. ప్రదర్శనలో భాగంగా ఆ ఫోన్ ద్వారా నెట్ స్పీడ్ పరీక్షించగా అది 978 ఎంబీపీఎస్ స్పీడ్‌ను చూపింది.
ఇవి స్పెష‌ల్‌..
* మోటో జీ5...
5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్
 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
 ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
 వాటర్ రీపెల్లెంట్ కోటింగ్, 4జీ వీవోఎల్‌టీఈ
 బ్లూటూత్ 4.2, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, ర్యాపిడ్ చార్జింగ్
 * మోటో జీ5 ప్లస్...
 5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
 ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
 వాటర్ రీపెల్లెంట్ కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్
 * హువావే పీ10...
 5.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
 గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
 ఆక్టాకోర్ కైరిన్ 960 ప్రాసెసర్, ఆక్టాకోర్ గ్రాఫిక్స్
 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
 ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
 20, 12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు

 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
 ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ బ్యాండ్ వైఫై
 బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 4జీ వీవోఎల్‌టీఈ
 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
 * హువావే పీ10 ప్లస్...
 5.5 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌సీడీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
 గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2560 X 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
 ఆక్టాకోర్ కైరిన్ 960 ప్రాసెసర్, ఆక్టాకోర్ గ్రాఫిక్స్
 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
 20, 12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
 ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
 డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ
 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
 * ఎల్‌జీ జీ6 ఫీచర్లు...
 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
 1440 X 2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
 క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్
 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
 ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
 ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
 బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0

 

"

జన రంజకమైన వార్తలు