జియోమీ దూసుకుపోతోంది. కేవలం మొబైల్ ఫోన్‌లలోనే కాకుండా యాక్సెసరీస్‌లోనూ శాంసంగ్, యాపింల్ వంటి దిగ్గజాలను వణికిస్తోంది. తక్కువ ధరలో నాణ్యవంతమైన గ్యాడ్జెట్స్‌ని మార్కెట్లోకి తెస్తూ.. లీడర్ అయిపోతోంది. మొన్నటిదాకా ఫోన్లతో హల్‌చల్ చేసిన జియోమీ ఇటీవలే ఫిట్‌నెస్ వివరాలను వెల్లడించే బ్యాండ్.. ఫిట్‌బిట్‌ను తీసుకొచ్చింది. దీన్ని జియోమీ ఫోన్లకు అనుసంధానించుకొని వాడుకోవచ్చు. రూ.999 ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ బ్యాండ్ ఇప్పడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా అమ్ముడవుతున్న వియరబుల్ డివైజస్‌లో రెండో స్థానంలో ఉంది. ఈ మేరకు ఐడీసీ నివేదిక వెల్లడించింది. గతేడాది ఆగస్ట్ లో విడుదలైన ఈ బ్యాండ్ భారత్, మలేసియా, చైనా, సింగపూర్, తైవాన్, ఇండోనేసియాలో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు జియోమీ అమెరికాలోనూ ఈ బ్యాండ్ విక్రయాలను ప్రారంభించింది. అక్కడా అవి ఊపందుకొంటే త్వరలోనే ఇది వియరబుల్ డివైజస్‌లో మొదటి స్థానంలో ఉంటుందని విశ్లేషకుల అంచనా. వాస్తవానికి ఈ బ్యాండ్‌ను జియోమీ రూపొందించడం లేదు. ఈ పేరు మీద హువామీ అనే సంస్థ తయారు చేసిస్తోంది. ఫ్లాష్ సేల్.. తక్కువ ధరకు అధునాతన ఫీచర్లతో ఇప్పటికే ఎవర్‌గ్రీన్ హాట్ డివైజ్ అయిన జియోమీ.. భవిష్యత్తులో ఇంకెన్ని సంచనాలను సృష్టిస్తుందో. ఇవీ మి బ్యాండ్ ప్రత్యేకతలు
|