• తాజా వార్తలు

మీ ఫోన్ ని మీరే రిపెయిర్ చేసుకోండి ఐదు విధాలుగా

న ఫోన్ లు తరచుగా చేతిలోనుంచి జారిపోవడం జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి అవి పాడయిపోతూ ఉంటాయి.ఒక్కోసారి మన ఫోన్ లలో ఉండే బటన్ లు సరిగా పనిచేయక ఉంటాయి. మరొకసారిఫోన్ లో బాటరీ లు పాడవుతూఉంటాయి. మరి అలాంటి సందర్భాలలో మనం ఏం చేస్తాం? ఏముంది చిన్న చిన్న రిపేర్ లు అయితే ఫోన్ మెకానిక్ తో రిపేర్ చేయిస్తాం లేదా మన ఫోన్ కనుక ఎక్కువ ధర లో కొన్నది అయితే భీమా ను క్లెయిమ్ చేస్తాము. అలా కాకుండా మన ఫోన్ లలో వచ్చే చిన్నచిన్న రిపేర్ లను మనమే బాగుచేసుకోలేమా?

ఖచ్చితంగా చేసుకోగలము. మన దగ్గర ఒక చిన్న సైజు స్క్రూ డ్రైవర్ కిట్ మరియు ఎలక్ట్రానిక్ కాంపోనేన్ట్స్ ఉంటే చాలు మన ఫోన్ మనమే రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే మీ ఫోన్ ను రిపేర్ చేయడానికి నిర్ణయించుకుని దానిని ఓపెన్ చేసే ముందు ఒక్కసారి దాని తయారీదారుతో మాట్లాడి చేయడం ఉత్తమం. మీ ఫోన్ లో అనేకమైన చిన్న చిన్న స్క్రూ లు ఉంటాయి కాబట్టి ఒక చిన్న స్క్రూ డ్రైవర్ కిట్ ఉండడం శ్రేయస్కరం. ఇవి మీకు ఆన్ లైన్ లో కానీ ఎలక్ట్రికల్ స్టోర్స్ లో కానీ దొరుకుతాయి.

అసలు సాధారణంగా ఫోన్ లలో ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటిని మనం ఎలా రిపేర్ చేసుకోగాలమో చూద్దాం.

ఓవర్ హీటింగ్ ప్రాబ్లం

కొత్తగా లాంచ్ అయిన ఫోన్ లు అన్నింటిలోనూ సాధారణంగా ఉండే సమస్యే ఇది. ఇది బాటరీ వలన ఉత్పన్నం కావచ్చు. కాబట్టి బాటరీ ని తొందరగా డ్రెయిన్ చేసే యాప్ లు ఏవో గుర్తించి వాటిని టర్న్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత బాటరీ ని ఫోన్ నుండి బయటకు తీసి గాలి తగిలేట్లు ఉంచాలి. ఇరుకుగా ఉండే ప్రదేశాలలో దీనిని ఉంచకూడదు. ఫోన్ కూలర్ ను కూడా మీరు ఉపయోగించవచ్చు. దానివలన చాలావరకూ ఈ ఫోన్ వేడి అవడం అనే సమస్య నుండి బయటపడవచ్చు.

బటన్ ప్రెస్సింగ్ ప్రాబ్లం

ఇప్పటికే QWERTY మోడల్ కీ పాడ్ ఉన్న ఫోన్ లను వాడుతున్న వరికి ఇది తరచుగా వచ్చే సమస్య. ఇవి కాకుండా టచ్ ఫోన్ లు వాడుతున్న వారికి వచ్చే సమస్యలలో ముఖ్యమైనది వాల్యూం బటన్ లు సరిగ్గా పనిచేయకపోవడం. ఒక్కోసారి గట్టిగా నొక్కితే ఇవి పనిచేస్తాయి. అప్పటికీ అవి సరిగా పనిచేయకపోతే ఒక దూదిలాంటి మెత్తటి వస్త్రం ఏదైనా తీసుకుని దానిని కొంచెం ఆల్కాహాల్ లో ముంచి మృదువుగా ఈ వాల్యూం బటన్ లపై కొంచెంసేపు రుద్దితే చాలు. మీ సమస్య తీరిపోతుంది. వాల్యూం బటన్ లు పనిచేస్తాయి. అప్పటికీ పనిచేయకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మీ దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్ కిట్ తో ఫోన్ ను ఓపెన్ చేసి ఆ వాల్యూం బటన్ ను రీప్లేస్ చేసుకోవచ్చు. మనం ఫోన్ యొక్క మోడల్ ను బట్టి స్పేర్ పార్ట్ లు ఆన్ లోన్ లో దొరుకుతాయి.

బాటరీ ప్రాబ్లం

స్మార్ట్ ఫోన్ ల బాటరీ లు తొందరగా పాడవుతూ ఉంటాయి అనే అపవాదు ఉంది, కొంతవరకూ అది నిజం కూడా. మనం దేనినీ నమ్మడానికి వీల్లేదు. కొంతకాలం మీరు వాడిన తర్వాత బాటరీ మార్చే సందర్భం వస్తుంది. అలాంటపుడు బాటరీ లను ఆన్ లైన్ లో కొనడమే మంచిది. ఆన్ లైన్ లో అయితే మీ ఫోన్ మోడల్ కు తగిన బాటరీ దొరుకుతుంది. ఆ తర్వాత జాగ్రత్తగా మీ బాటరీ ని రీప్లేస్ చేసుకోండి.

ఛార్జింగ్ పోర్ట్ ప్రాబ్లం

మీరు కొంతకాలం ఫోన్ వాడిన తర్వాత మనం ఫోన్ లో ఛార్జింగ్ కు ఉపయోగించే మైక్రో USB పోర్ట్ లూజ్ అవుతుంది. దీనివలన మీ చార్జర్ సరిగా ఉన్నాసరే మీ ఫోన్ కు ఛార్జింగ్ ఎక్కదు. మనకు చికాకుగా ఉంటుంది. దీనికి మీరు చేయవలసిందల్లా మీ దగ్గర ఉన్న టోల్ కిట్ లో బాగా సన్నగా, పదునుగా ఉన్న పరికరాలతో దానిని ఓపెన్ చేసి ఎక్కడైతే స్క్రూ లు లూజ్ అవుతాయో అక్కడ టైట్ చేస్తే సరిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక్కసారి చార్జర్ తో పరీక్షించి ఆ తర్వాతా మీరు ఫోన్ ను మామూలుగానే వాడవచ్చు.

హెడ్ ఫోన్ జాక్ ప్రాబ్లం

ఇది కూడా పైన ఉదహరించిన సమస్య లాంటిదే. హెడ్ ఫోన్ యొక్క జాక్ లలో దుమ్ము ధూళి లాంటివి పేరుకుపోవడం వలన కానీ లేక ఆ జాక్ లు లూజ్ అవ్వడం వలన కానీ హెడ్ ఫోన్ లు సరిగా పనిచేయవు. దీనికోసం మీ ఫోన్ ను ఓపెన్ చేయవలసిన అవసరం లేదు. మెత్తటి దూది లాంటి వస్త్రాన్ని తీసుకుని ఆ జాక్ పై మృదువుగా రుద్దితే చాలు. మీ సమస్య పరిష్కారం అవుతుంది.  

 

జన రంజకమైన వార్తలు