• తాజా వార్తలు

జియోని నుంచి కొత్త ఫోన్…. జియోని ఎస్‌6 ప్రో స్మార్టుఫోన్‌

ప్ర‌ముఖ చైనీస్ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ జియాని మార్కెట్ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు, వినియోగ‌దారుల‌కు న‌చ్చేట్లు స్మార్టుఫోన్ల‌ను త‌యారు చేయ‌డంలో ముందంజ‌లో ఉంటుంది.  భిన్న‌మైన ఆప్ష‌న్ల‌తో జియోని కంపెనీ ఎస్ 6 ప్రో స్మార్టుఫోన్‌ను రంగంలోకి తెచ్చింది. ఈ ఫోన్ జూన్ 16 నుంచి వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రానుంది.  గ‌తేడాది ఈ కంపెనీ నుంచే వ‌చ్చిన ఎస్ 6 ఫోన్‌కు కొన‌సాగింపుగా ఎస్ 6 ప్రో మోడ‌ల్‌ను విడుద‌ల చేస్తోందీ సంస్థ‌.  యూనిబాడీ మెట‌ల్ డిజైన్‌తో తయారు చేసిన ఈ ఎస్ 6 ప్రో మోడ‌ల్ ఫోన్ చూడ‌గానే ఆక‌ట్టుకునేలా త‌యారైంది.  ఈ ఫోన్‌లో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు యూఎస్‌బీ టైప్ సి-స‌పోర్ట్ ఆప్ష‌న్లు కూడా ఉన్నాయి. 

ఆ కంపెనీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం జియోని తెస్తున్న ఎస్ 6 ప్రో ఫోన్ స్క్రీన్ 5.5 అంగుళాలు ఉండి ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో త‌యారైంది.  దీని పిక్స‌ల్ రిజ‌ల్యూష‌న్ కూడా గ‌త జియోని ఫోన్ల‌తో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.  1.8 గిగా హెట్జ్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగ‌న్ 652 ప్రోసెస‌ర్ ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త‌. అన్నిటికంటే కీల‌క‌మైంది ఏంటంటే ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్‌తో త‌యారు కావ‌డం. ఈ శ్రేణిలో త‌యారైన ఫోన్లలో ఇంత‌టి సామ‌ర్థ్యం ఉన్న ఫోన్ ఇదేన‌ని జియోని చెబుతోంది.  దీని ఇంట‌ర్న‌ల్ స్టేరేజ్ కూడా ఎక్కువే. 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో పాటు ఎస్‌డీ కార్డ్ ద్వారా 64 జీబీ వ‌ర‌కు స్టోరేజ్‌ను ఎక్స్‌పాండ్ చేసుకునే అవ‌కాశం ఉంద‌ట‌.

జియోని ఎస్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ 13 ఎంపీ రేర్ కెమెరాతో త‌యారైంది. ఎల్ఈడీ ఫ్లాష్ దీనికున్న మ‌రో ప్ర‌త్యేక‌త‌. ముఖ్యంగా సెల్ఫీలు తీసుకోవ‌డానికి మ‌క్కువ చూపించేవారికి దీనిలో ఉన్న 8 ఎంపీ సెల్ఫీ షూట‌ర్ ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌నుంది.  క‌నెక్ట‌విటీ ఆప్ష‌న్ల‌ను చూస్తే 4జీ, ఎల్‌టీఈ, 3జీ, వైఫై, బ్లూటూత్‌, జీపీఎస్ ఇలా అన్ని ర‌కాలు అందుబాటులో ఉన్నాయి.  దీని బ్యాట‌రీ సామ‌ర్థ్యం 3130 ఎంఏహెచ్‌. 

 

జన రంజకమైన వార్తలు