రిలయన్స్ జియో యొక్క హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ నేపథ్యం లో ఇండియన్ టెలికాం ఆపరేటర్ లు తమ వినియోగదారులు చేజారిపోకుండా ఉండాలి అంటే ఆకర్షణీయమైన ఆఫర్ లను ప్రవేశపెట్టక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. ఉచితంగా కాకపోయినా కనీస ధరలోనైనా ఆకర్షణీయమైన ఆఫర్ లను ప్రవేశ పెట్టినపుడే వినియోగదారులు జియో యొక్క మాయ ( ? ) నుండి బయటపడి తమ నెట్ వర్క్ లకు అంటిపెట్టుకుని ఉంటారు అనే విషయాన్ని గ్రహించిన భారత టెలికాం ఆపరేటర్ లు జియో యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వివిధ రకాల ఆకర్షణీయమైన ఆఫర్ లను ప్రకటిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యం లోనే ఐడియా రీసెంట్ గ ఐడియా మ్యూజిక్ లాంజ్, ఐడియా మూవీ క్లబ్, మరియు ఐడియా గేమ్ స్పార్క్ అనే డిజిటల్ సర్వీస్ లను ప్రారంభించింది. అయితే ఇదే తరహా సర్వీస్ లు ఎయిర్ టెల్ మరియు జియో లు కూడా అందిస్తున్నాయి కదా మరి కొత్తగా ఇందులో ఏముంది అనే విషయాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం.
మ్యూజిక్ :- ఐడియా మ్యూజిక్ సర్వీస్ లో సుమారు 13 భారతీయ మరియు ప్రపంచ భాషలలోని 20 లక్షలకు పైగా మ్యూజిక్ ట్రాక్ లు ఉన్నాయి. ఈ సంఖ్య అతి త్వరలోనే 2 కోట్ల కు చేరుకోనుంది అని ఐడియా ప్రకటించింది. దీనిని ఎయిర్ టెల్ మరియు జియో లతో పోల్చి చూస్తే జియో మ్యూజిక్ ఒక కోటి కి పైగా పాటలను అందిస్తుండగా ఎయిర్ టెల్ యొక్క వింక్ మ్యూజిక్ కేవలం 20 లక్షల 80 వేళా పాటలను మాత్రమే కలిగిఉంది. ఇక ధర విషయానికొస్తే జియో యొక్క సర్వీస్ లు ఈ సంవత్సరాంతం వరకూ ఉచితంగానే లభిస్తాయి. అదే ఐడియా అయితే 90 రోజుల ఉచిత సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. కాకపోతే మీరు ఈ యాప్ ను మార్చి 31 లోపు డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెలకు దీని ధర రూ 49/- లు ఉంటుంది. మరొకప్రక్క ఎయిర్ టెల్ మాత్రం మొదటి నెల సబ్ స్క్రిప్షన్ తర్వాత నెలకు రూ 99/- లు ఛార్జ్ చేస్తుంది.
మూవీస్ :- ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎరోస్ తో ఐడియా ఒప్పందం కుదుర్చుకున్నట్లు కనిపిస్తుంది. తద్వారా ఇది తన కస్టమర్ లకు వేలకొద్దీ సినిమా లను అందిస్తుంది. ఇది లైవ్ టీవీ ని కూడా అందిస్తుంది. దీనిలో ఇది జీ స్టూడియో, ఆజ్ తక్, లాంటి మరో 80 రకాల లైవ్ టీవీ చానల్ లను డిట్టో టీవీ యొక్క భాగస్వామ్యంతో అందిస్తుంది. అదే జియో అయితే ఐడియా కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా అంటే 400 చానల్ ల దాకా అందిస్తుంది. ఇక మూవీ కాంటెంట్ ల విషయానికొస్తే ఈ మూడు సర్వీస్ లో ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ స్థాయి మూవీ లను అందిస్తున్నాయి. అంత మాత్రమే గాక కాంటెంట్ ఆఫ్ లైన్, డ్యూయల్ స్క్రీన్ మోడ్ లాంటి కొన్ని అధునాతన ఫీచర్ లను కూడా అందిస్తుంది. ఇక ధర విషయానికొస్తే జియో ఉచితం అనే సంగతి మనకు తెలిసినదే.ఎయిర్ టెల్ రూ 149/- ల వరకూ ఛార్జ్ చేస్తుండగా ఐడియా మూవీ క్లబ్ యొక్క ధర రూ 49/- గా ఉన్నది.
గేమ్స్ :- మూవీ లాంజ్ మరియు ఐడియా మ్యూజిక్ లతో పాటు ఈ ఐడియా సెల్యూలర్ ఐడియా గేమ్ స్పార్క్ ను కూడా ప్రవేశపెట్టింది. వివిధ రకాల జోనర్ లలో ఉన్న సుమారు 1500 గేమ్ లను ఇది కలిగి ఉన్నట్లు ఐడియా చెబుతుంది. అలాగే వర్చ్యువల్ రియాలిటీ ని కూడా ప్రధానంగా తెరపైకి తీసుకువస్తున్నారు. ఇక ధర విషయానికొస్తే యూజర్ లు అన్ లిమిటెడ్ గేమ్ మరియు డౌన్ లోడ్ లకు నెలకు రూ 29- లు చెల్లించాలి. ఇది కూడా మార్చి 31 లోపు డౌన్ లోడ్ చేసుకుంటే 90 రోజుల ఉచిత సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. ఇక్కడ స్పష్టం అయ్యే విషయం ఏమిటంటే గేమింగ్ విషయం లో ఐడియా కు ఏదీ పోటీగాలేదు. మిగతా రెండు సర్వీస్ లూ ఈ విషయం లో ఐడియా కంటే కొంచెం వెనుకపడి ఉన్నాయి.
చూశారుగా ! పై విశ్లేషణ ను బట్టి మీకు ఏది నచ్చితే దానిని సెలెక్ట్ చేసుకోండి. ఎయిర్ టెల్ మరియు జియో లకంటే ఐడియా ఏ రకంగా మెరుగైనదో మీకే తెలుస్తుంది. .
"
"
"