• తాజా వార్తలు

జియో సిమ్ కార్డులు కాకుండా ఆఫర్ చేస్తున్న మరో 9 ప్రోడక్ట్ లు ఇవి

భారత టెలికాం ఇండస్ట్రీ లోని సరికొత్త సంచలనం అయిన రిలయన్స్ జియో తన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను ప్రకటిస్తూ జియో యొక్క ఉచిత డేటా నెట్ వర్క్ సేవలు 2017 మార్చి వరకూ కొనసాగుతాయని ప్రకటించింది. ఈ నేపథ్యం లో జియో వినియోగదారులు అందరూ ఈ ఫ్రీ డేటా ను ఉపయోగించి నెట్ ఎలా వాడాలి, యు ట్యూబ్ లో వీడియో లు ఎలా చూడాలి అనే విషయాల గురించే ఆలోచిస్తున్నారు తప్ప ఈ ఆఫర్ తో పాటు కేవలం సిమ్ కార్డు మాత్రమే కాక దానితో పాటు లభించే మరిన్ని ఇతర సర్వీస్ లను జియో ప్రారంభించింది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇంతకీ ఆ సర్వీస్ లు ఏమిటి? జియో కేవలం సిమ్ కార్డు మాత్రమే కాక ఇంకా ఏమేమి అందిస్తుంది? తదితర విషయాలను ఈ వ్యాసం లో చూద్దాం.

జియో టీవీ

లైవ్ టీవీ అలాగే గత వారం రోజుల నుండీ వస్తున్న ప్రోగ్రాం లను చూసే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తుంది.  ఇది 350 కి పైగా చానల్ లను అందిస్తుంది. దీనిని కేవలo స్మార్ట్ ఫోన్ మరియు ట్యాబు లలో మాత్రమే చూడగలము.

జియో చాట్

ప్రముఖ మెసేజింగ్ యాప్ లైన్ వాట్స్ అప్, మెసెంజర్ లకు పోటీగా జియో ఈ యాప్ ను అందిస్తుంది. మెసేజింగ్, హై క్వాలిటీ వాయిస్ మరియు వీడియో కాలింగ్ లాంటి ఫీచర్ లతో పాటు స్టిక్కర్స్, డూడుల్, ఎమోటికాన్స్ లాంటి యాడ్ ఆన్ లతో కూడా ఇది లభిస్తుంది.

జియో సినిమా

పేరుకు తగ్గట్లే ఇది మూవీ లను చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందులో అతి పెద్ద వీడియో లైబ్రరీ ఉంటుంది. ఈ లైబ్రరీ లో ఒక లక్ష గంటలకు పైగా మూవీ లు, టీవీ షో లు, మ్యూజిక్ వీడియో లు, జియో షాట్ లు, మరియు ట్రైలర్ లు ఉంటాయి. ఇందులో ఉండేదంతా దాదాపుగా ఉచిత కాంటేంటే. యూజర్ లు కావాలంటే మూవీ లను కొనుగోలు చేయవచ్చు.

జియో మ్యూజిక్

ఇది ఒక మ్యూజిక్ స్ట్రీమింగ్ మరియు డౌన్ లోడింగ్ సర్వీస్. ఇది HD మ్యూజిక్ ను జియో యాజర్ ల కోసం ఎక్స్ క్లూజివ్ గా అందిస్తుంది. ఇందులో ఉండే సాంగ్ లన్నీ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జియో సిమ్ వినియోగదారులకు మాత్రమే ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. వివిధ భాషలలోని ఒక కోటి కి పైగా పాటలు ఈ యాప్ లో ఉంటాయి.

జియో మ్యాగ్స్

ఇది కూడా ప్రత్యేకంగా జియో వినియోగదారులకు మాత్రమే. దేశం లో పబ్లిష్ అయ్యే వివిధ రకాల టాప్ మ్యాగజైన్ లను బ్రౌజ్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందులో టెక్స్ట్ టు స్పీచ్ ఫీచర్ ఉంటుంది.ఇది టెక్స్ట్ ను ఆడియో గా మారుస్తుంది. అంటే మనం చదవాలంటే చదవవచ్చు లేకపోతే వినవచ్చు. ఆఫ్ లైన్ లో చదవడానికి మ్యాగజిన్ లను డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు.

జియో ఎక్స్ ప్రెస్ న్యూస్

వివిధ రకాల ప్రముఖ మ్యాగజిన్ లు, బ్లాగ్ లు, వెబ్ సైట్ లలో ఉండే సమాచారాన్ని చదవడానికి ఇది ఉపకరిస్తుంది. కేవలం ఇండియా లో మాత్రమే కాక ప్రపంచం లో ఉన్న ప్రముఖ బ్లాగర్ ల యొక్క అభిప్రాయాలను దేనిని ఉపయోగించి చూడవచ్చు.

జియో మనీ

డీ మానిటైజేషన్ జరిగిన తర్వాత ఇండియా లో అందరూ చర్చిస్తున్న అంశం డిజిటల్ వాలెట్ లు. కాష్ లెస్ లావాదేవీ లను అందించడానికి జియో సరికొత్తగా లాంచ్ చేసినమా సర్వీస్ ఈ జియో మనీ. ఇది కూడా మిగతా డిజిటల్ వాలెట్ ల లాగే పనిచేస్తుంది. ఈ వాలెట్ ను ఉపయోగించి మీరు మీ మొబైల్ మరియు dth రీ ఛార్జ్ లతో ఇతర ట్రాన్స క్షణ్ లను కూడా చేయవచ్చు.

జియో సెక్యూరిటీ

నార్టన్ మొబైల్ ఇన్ సైట్స్ సంస్థ చే పవర్ చేయబడిన యాంటి వైరస్ యాప్ ను జియో అందిస్తుంది. ఇది మీమొబైల్ లు మరియు ఇతర పరికరాల లోని డేటా ను కాపాడుతుంది. వెబ్ సైట్ లను మరియు మీరు డౌన్ లోడ్ చేసే ఫైల్ లు అన్నింటినీ స్కాన్ చ్గేసే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. అంతేగాక మీ డేటా హ్యాకింగ్ గురి అవకుండా ఇది కాపాడుతుంది. అంతేగాక బాటరీ ని ఎక్కువగా ఉపయోగించే యాప్ ల గురించి కూడా ఇది తెలియజేస్తుంది.

జియో న్యూస్ పేపర్

ఇది కూడా జియో వినియోగదారులకు మాత్రమే. ఇది ఇండియా లోని సుమారు పది కి పైగా భాషల లోని న్యూస్ పేపర్ లను చూసే అవకాశాన్ని కల్పిస్తుంది.

జన రంజకమైన వార్తలు