గత ఏడాది చైనాలో దుమ్ము రేపిన జియానీ ఎస్6 ఫోన్ ఇప్పుడు ఇండియాలోనూ లాంఛ్ అయింది. గత ఏడాది చైనాలో రిలీజ్ అయిన తరువాత మంచి ఆదరణ పొందిన ఈ ఫోన్ ఇప్పుడు ఇండియాలో లభ్యమవుతోంది. అయితే... ప్రస్తుతం కేవలం ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే దొరుకుతోంది. 3జీబీ ర్యామ్ తో ఫాస్ట్ యాక్సెస్ ఉండే దీని ధర రూ.19,999 గా నిర్ణయించారు. స్పెసిఫికేషన్స్: - దీనిలో డ్యూయల్ సిమ్ సౌకర్యం ఉంది. - 5.5 అంగుళాల హెచ్ డీ సూపర్ అమోలేడ్ తెర - గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. - 64 బిట్ ఆక్టో కోర్ మీడియా టెక్ MT 6735 1.3GHz ప్రాసెసర్ దీని ప్రత్యేకత. - 3జీబీ ర్యామ్, మాలి T720 GPU, 13మెగా పిక్సెల్ ఆటో ఫోకస్ రియర్ కెమెరా ఉన్నాయి. రియర్ కెమేరాకు ఎల్ ఈడీ ఫ్లాష్ సదుపాయం ఉంది. - ఫుల్ హెచ్ డీ వీడియో రికార్డింగు కూడా ఉంది. - ఇక ఫ్రంటు కెమేరా కూడా బాగుంది. 5 మెగా పిక్సెళ్ల సామర్థ్యంతో ఇది పనిచేస్తుంది. - పూర్తిగా మెటల్ బాడీ కావడంతో ఫోన్ బరువు ఎక్కువగా ఉంది. - 32 జీబీ అంతర్గత స్టోరేజి ఉంది. - ఎక్స్టర్నల్ ఎస్ డీ కార్డు సహాయంతో మెమొరీ 128 జీబీ వరకు పెంచుకోవచ్చు - 3150 mah బ్యాటరీ దీని ప్రత్యేకత. - , 4G LTE, OTG సపోర్ట్, 148 గ్రా బరువు తో గోల్డ్, సిల్వర్ అండ్ రోజ్ గోల్డ్ కలర్స్ ఆప్షన్స్ లో దొరుకుతోంది. |