• తాజా వార్తలు

గూగుల్ మ్యాప్సు లైవ్ ట్రాఫిక్ అలర్ట్సు vs ట్రాఫి (TRAFI) యాప్

గూగుల్‌కు చెందిన మ్యాప్సు యాప్ ఇప్పడు కొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది.  కాగా కొత్త అప్‌డేట్‌తో గూగుల్ మ్యాప్సులో యూజర్లు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్టులు తెలుసుకునేందుకు వీలుంది. ఇందుకోసం డివైస్‌లో ఇంటర్నెట్‌తోపాటు, జీపీఎస్‌ను యాక్టివేట్ చేయాలి. అంతేకాకుండా మ్యాపుల్లోని  నావిగేషన్ మోడ్‌లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో నావిగేషన్‌లో ఉండగానే ఓ ఫిమేల్ వాయిస్ ట్రాఫిక్ అలర్టులను యూజర్‌కు వినిపిస్తుంది. ఈ యాప్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను యూజర్లు ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏదైనా రోడ్‌లో ట్రాఫిక్ జాం అయినా, ఇబ్బంది ఉన్నా యూజర్‌కు తెలుపుతుంది. సదరు ట్రాఫిక్ ఎంత సేపట్లో క్లియర్ అవుతుందో, లేదంటే వేరే ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం ఉందా, లేదా అనే వివరాలను కూడా యూజర్‌కు వివరిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొనే యూజర్లకు ఈ యాప్ అప్‌డేట్ మరింతగా ఉపయోగపడుతుందని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు.

కాగా ట్రాఫిక్ అలర్టుల్లో ఇంటర్నేషనల్ గా పాపులర్ అయిన 'ట్రాఫి(TRAFI)' యాప్ ఇప్పుడు ఇండియాలో ఎంటరైపోయింది. బెంగుళూరు, ముంబై వాసులకు అందుబాటులోకి వచ్చింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లు దీన్ని ఇప్పుడు తమ తమ యాప్ స్టోర్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  ప్రజా రవాణాను ఆశ్రయించే వారి కోసం ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రయాణికులెవరైనా ఈ యాప్ ద్వారా తమకు దగ్గర్లో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని రకాల ప్రజా రవాణా సౌకర్యాలను, ట్రాఫిక్‌ను రియల్‌టైంలో తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. అంతేకాదు ఎవరైనా వాహనదారులు ట్రాఫిక్ జాంలో చిక్కుకున్నా, యాక్సిడెంట్ల బారిన పడినా, వాటిని గుర్తించినా వెంటనే యాప్ ద్వారా సంబంధిత అధికారులకు సమాచారాన్ని సులభంగా చేరవేయవచ్చు. ట్రాఫి యాప్ ద్వారా వివిధ రకాల రూట్ల గురించి సెర్చి  చేసి తెలుసుకోవచ్చు. తరువాతి స్టాప్ ఎంత దూరంలో ఉందో కూడా సులభంగా గుర్తించవచ్చు.  గూగుల్ ట్రాఫిక్ అలర్ట్సు, ట్రాఫి యాప్ లతో మహా నగరాల్లోని ప్రజలకు మంచిదే మరి.

 

జన రంజకమైన వార్తలు