• తాజా వార్తలు

గూగుల్ చేయలేని పనులని కూడా చేస్తున్న శోధన్

గూగుల్ చేయలేని పనులని కూడా చేస్తున్న శోధన్

ఒక తెలుగు సినిమా లో విలన్ హీరో ఎక్కడున్నాడో తెల్సుకోమని తన అనుచరునికి చెబితే అతను గూగుల్ తల్లి అంటూ గూగుల్ ను ఓపెన్ చేస్తాడు. చూడడానికి హాస్యం గా ఈ సన్నివేశం ఉన్నా, దాని అంతరార్థం మాత్రం అందరికీ అర్థo అయ్యింది. అంటే గూగుల్ లో  వెతికితే దొరకనిది అంటూ ఏమీ లేదు, నీకు ఏ చిన్న సమాచారం కావాలన్నా అది గూగుల్ లో దొరుకుతుంది. మరి ఆ గూగుల్ లో కూడా దొరకపోతే ఎక్కడ వెతకాలి?  ప్రశ్నకు సమాధానమే 'శోధన్'. అవును 'శోధన్' ఒక సరికొత్త సెర్చ్ ఇంజిన్. ఇది ఇంటర్ నెట్ అఫ్ థింగ్స్ యొక్క సెర్చ్ ఇంజిన్ . గూగుల్లో కనపడనిది ఏదైనా ఇందులో కనపడుతుంది. ఇంటర్ నెట్ చిన్న సెర్చ్ చేయడం ద్వారా మీరు ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ యొక్క కంట్రోల్ సిస్టం ను తెల్సుకోవచ్చు, నగరం లోని ట్రాఫిక్ యొక్క నియంత్రణా వ్యవస్థ ను తెల్సుకోవచ్చు, ప్రపంచం లోని అనుసంధాన పరికరాల యొక్క సమగ్ర సమాచారాన్ని తెల్సుకునే ఒక రహస్య మార్గం గా దీనిని అభివర్ణించ వచ్చు.

శోధన్ అనేది గూగుల్ లాంటి వెబ్ సెర్చ్ ఇంజిన్ కాదు, ఎందుకంటే గూగుల్ ఏదైనా మనకు సంచారాన్ని మాత్రమే ఇస్తుంది అదే శోధన్ అయితే పరికరాలను కనుగొంటుంది. గూగుల్ వెబ్ సైట్ ల సంచారం ఇస్తుంది. శోదన్ పరికరాల సమాచారం ఇస్తుంది.

జాన్ మ్యాతర్లీ అనే వ్యక్తి దీనిని రూపొందించాడు. ఇలాంటి ఒక వ్యవస్థ ను రూపొందించడానికి తానూ 2003 వ సంవత్సరం నుండీ కష్ట పడుతున్నట్లు ఆయన చెప్పాడు. సమగ్ర సమాచారాన్ని ఉంచే సెర్చ్ ఇంజిన్ అంటే మాటలు కాదు, ఒక్కోసారి వినియోగదారులు తప్పుడు సమాచారాన్ని కూడా ఉంచవచ్చు, కాబట్టి దీనికి P2P టెక్నాలజీ కావాలి.అందుకనే ఈ సెర్చ్ ఇంజిన్ P2P టెక్నాలజీ పై ఆధార పది పనిచేసే విధంగా రూపొందించాము అని జాన్ చెబుతున్నారు.

నిజానికి ఈ శోధన్ యొక్క అసలు ఉద్దేశం కంపెనీలకు ఉపయోగపడడమే. సాధారణంగా తమ ఉత్పత్తులను ఎంతమంది వాడుతున్నారు, ఎలా పనిచేస్తున్నాయి, తమ ఉత్పత్తుల పట్ల వినియోగదారుల్లో స్పందన ఎలా ఉంది తదితర విషయాలు కంపెనీలు ఈ శోధన్ ను ఉపయోగించి తెలుసుకుంటాయి. తద్వారా మెరుగైన ఉత్పాదకతను, నాణ్యతను పెంచడం వీలు అవుతుంది. అంతేగాక వారి పోటీదారుల సమాచారం కూడా వారికి లభ్యం అవుతుంది. ఇక్కడ  ఇంకో చిక్కు ఉంది. ఆన్లైన్ పైరేట్ లు ఈ శోధన్ ను పరిశ్రమల కంట్రోల్ సిస్టం ను తెల్సుకునే ఒక రహస్య సాదనం గా ఉపయోగిస్తూ ప్రపంచం నలుమూలల నుండీ హ్యాకింగ్ చేస్తూ ఉంటారు. దీని వలన ఈ శోధన్ అనేక విమర్శలను కూడా ఎదుర్కొంది. అయితే జాన్ మాత్రం ఈ విమర్శలను కొట్టి పారేస్తున్నాడు. తమది రహస్య మైన సెర్చ్ ఇంజిన్ కాదు అనీ అంత బహిరంగమే ననీ చెబుతున్నాడు. అంతేగాక లాగ్ ఇన్ అవ్వకుండా శోధన్ లోనికి ప్రవేశించడం జరుగదు, లాగ్ ఇన్ అయ్యిన తర్వాత కూడా కేవలం 10 నుండీ 50 వరకూ మాత్రమే వారు చూడగలరు. ఆ తర్వాత కావాలి అంటే పే మెంట్ ఆప్షన్ లోనికి వెళ్ళవలసి ఉంటుంది. దీనిని మరింత పటిష్టం చేసే దిశగా కూడా  చర్యలు జరుగుతున్నాయి అని జాన్ వెల్లడించాడు.

ప్రపంచం లోని టాప్ 100 కంపెనీలకు దీనిలో యాక్సెస్ ఉంది.ప్రపంచ నలుమూలల ఉన్న యూనివర్సిటీ లు కూడా ఇందులో భాగస్వాములే, OECD లాంటి ఆర్థిక గ్రూప్ లతోనూ ఈ శోధాన్ కలిసి పనిచేస్తుంది.కాబట్టి పాలసీ మేకర్ లు ఇంటర్ నెట్ యొక్క వృద్ధిని అర్థం చేసుకోవాలి అని కూడా జాన్ చెబుతున్నాడు.నేడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాలైన 300 రకాల సేవలను ఇది అందిస్తుంది. ప్రతీ సెకనుకూ 500 పరికరాలు దీనికి కనెక్ట్ అవుతున్నాయి.ఇప్పటికే 17 కోట్ల వెంబ్ సర్వీస్ లను అందిస్తున్న శోధన్ భవిష్యత్ లో మరిన్ని పరికరాలను కనెక్ట్ చేయడం ద్వారా తన విస్తృతిని పెంచుకోవాలని ఆశిస్తుంది.

శోధన్ అనేది ఒక భారతీయ పదం అవడం విశేషం

 

జన రంజకమైన వార్తలు