మొబైల్ ఫోన్ తో సిగరెట్ తాగితే ఎలా ఉంటుంది?ఒక్కసారి ఊహించండి. అదేం తొక్కలో ప్రశ్న.ఫోన్ తో సిగరెట్ తాగడం ఏమిటి?మీరు బాగానే ఉన్నారుగా?అని ఆశ్చర్య పడవద్దు.ఊహకందని అద్భుతాలను చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది.అలాంటి అద్భుతాలను తెలుగు పాఠకుల ముందు ఉంచడంలో కంప్యూటర్ విజ్ఞానం ఏ మాత్రం ఆలస్యం చేయదు.మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ వ్యాసం చదివేయండి. కాల్స్ తోనూ, ఈ మెయిల్ ల తోనూ,విపరీతమైన ఫేస్ బుక్ పోస్టుల తోనూ విసుగు వచ్చిందా? మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా? అయితే దానిని మీ ఫోన్ తో చేయాలనుందా?అలాంటి కల ఇప్పుడు నిజం అయింది.ఒక ప్రత్యేకమైన పరికరం ద్వారా ఒక్క ఎలక్ట్రానిక్ పఫ్ ను లాగించేయొచ్చు. దీనిని మీరు అద్భుతం అనుకోండి లేదా అసాధారణం అనుకోండి లేదా అసలు ఏమీ అనుకోకండి కానీ ఇది మాత్రం నిజం. US ఆధారిత కంపెనీ అయిన వాపర్ కేడ్ ఈ సిగరెట్ ఫ్లేవర్ లు ఉన్న స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.దీనితో మీరు కాల్స్ చేయడం,మెసేజ్ లు పంపించడం తో బాటు సిగరెట్ కూడా తాగవచ్చు.జుపిటర్ io 3 అనే స్మార్ట్ ఫోన్ ప్రపంచం లోనే మొట్టమొదటి ఈ సిగరెట్ తో నిర్మితమైన స్మార్ట్ ఫోన్. 3 జి సేవలను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర సుమారు 20,000 రూపాయల వరకూ ఉంటుంది.ఇది ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ 4.4 ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మొత్తం రెండు బాటరీ లను కలిగి ఉంటుంది.ఒక బ్యాటరీ ఫోన్ కు పవర్ ను అందిస్తే మరొక బ్యాటరీ ఈ-సిగరెట్ కు పవర్ ను అందిస్తుంది. ఈ రకంగా స్మార్ట్ ఫోన్ నూ, సిగరెట్ నూ వాడుతుంటే బ్యాటరీ లైఫ్ టైం త్వరగా అయిపోతోందేమోనని భయపడవలసిన అవసరం లేదు.ఎందుకంటే ఇది మాములు స్మార్ట్ ఫోన్ ల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ టైం ను అందిస్తుంది. ఫోన్ యొక్క లై భాగం లో ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ కింద చిన్న ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఓపెనింగ్ కు లిక్విడ్ కాట్రిడ్జ్ నూ,మౌత్ పీస్ నూ అటాచ్ చేయబడి ఉంటుంది.ఇక అక్కడ ఎంచక్కా పఫ్ లాగించ వచ్చు.వేడిని నియంత్రణ లో ఉంచడానికి గట్టి దమ్ము లాగించడానికి అక్కడ ఒక బటన్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. లిక్విడ్ కాట్రిడ్జ్ యొక్క ధర సుమారు వేయి రూపాయల వరకూ ఉంటుంది.ఇది మీకు 800 పైగా దమ్ములను లేదా 4 సిగరెట్ ప్యాక్ లు అందించే కిక్ నూ అందిస్తుంది. అంతేకాదు ఇది మింట్,పీచ్,కాఫీ లాంటి వివిధ రకాల ఫ్లేవర్ లలో కూడా లభిస్తుంది. ఈ కంపెనీ ఫోన్ లో ఒక యాప్ ను ఇన్స్టాల్ చేసి ఉంచుతుంది.బ్యాటరీ లైఫ్,ఇంకా కాట్రిడ్జ్ లో ఎంత లిక్విడ్ మిగిలి ఉంది,ఏ ఫ్లేవర్ అందులో లోడ్ చేయబడింది,ఇప్పటి వరకూ మీరు ఎన్ని దమ్ములు కొట్టారు తదితర వివరాలన్నీ ఆ యాప్ లో మీకు కనిపిస్తాయి. స్మోకింగ్ ఆపాలన్నా లేదా కొంచెం బ్రేక్ ఇవ్వాలన్నా అందులో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మీకు అలెర్ట్ లను అందిస్తుంది. దీని వలన ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా ,ఫోన్ పై దీని ప్రభావం ఎంత ఉంటుంది తదితర అంశాలు ఇంకా తెలియవలసి ఉంది.ప్రస్తుతానికైతే ఇది అప్రూవల్ కోసం US ఫెడరల్ కమిషన్ ముందు ఉన్నది.కానీ అప్పుడే ఇది దీని యొక్క 4 జి మోడల్ ను విడుదల చేసే పనిలో చాలా బిజీ గా ఉంది.దీని ధర సుమారు 33,000 రూపాయలు ఉంటుంది. కాబట్ట్టి దమ్ము బాబులు ఇక పండగ చేసుకోండి.ఎందుకంటే ఇది అతి త్వరలోనే భారత మార్కెట్ లోకి కూడా ప్రవేశించ బోతోంది. |