• తాజా వార్తలు

హెచ్‌పీ నుంచి అతి పల్చటి ల్యాప్‌టాప్‌..!

ప్రముఖ ఎలక్టానిక్‌ పరికరాల సంస్థ హెచ్‌పీ ప్రపంచంలోనే అతి పల్చటి (మందం తక్కువ) ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. 'స్పెక్టర్‌ 13 అల్ట్రాబుక్‌'గా నామకరణం చేశారు. ముదురు బూడిద రంగులో అల్యూమినియం బాడీతో పాటు.. అంచులు ఇత్తడి రంగులో కనిపించనుంది. ఈ ల్యాప్‌టాప్‌ను చూడగానే రిచ్‌లుక్‌లా కనిపించేలా తీర్చిదిద్దారట. ప్రస్తుతం అమెరికాలోనే అవిష్కరించిన ఆ ల్యాప్‌టాప్‌ బుకింగ్స్‌ ఈ నెల 25 నుంచి ప్రారంభం అవుతాయి. మే మొదటివారంలో వీటిని డెలివరి చేయనున్నారు. 

ల్యాప్‌టాప్‌కు సంబంధించిన ఇతర వివరాలు

1) 1.11 కిలోల బరువు కలిగిన ఈ ల్యాప్‌టాప్‌ 10.4 మిల్లీమీటర్ల మందం మాత్రమే కలిగి ఉండనుంది.

2) 8జీబి ర్యామ్‌

3) 1080 ఫిక్షల్‌ డిస్‌ప్లే

4) ఇంటెల్‌ కోర్‌ ఐ5, ఐ7 ప్రాసెసర్‌

5) 10 గంటల బ్యాటరీ బ్యాకప్‌ ఇవ్వనుంది.

6) బ్యాటరీ సామర్యం కోసం దానిని పల్చటి పలకల మాదిరిగా తయారు చేశారు. 

7) సౌండ్‌ వినసొంపుా ఉండటంతో పాటు సంగీత ప్రియుల కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. 

8) అమెరికాలో ఈ ల్యాప్‌టాప్‌ ధర 80వేలుగా ఉండనుంది. 

 

జన రంజకమైన వార్తలు