• తాజా వార్తలు

హానర్ నుంచి స్మార్టు బ్రేస్ లెట్, స్కేల్, ఎన్విరానమెంట్ మోనిటర్

చైనాలో రీసెంటు హానర్ 9 మొబైల్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. దాంతో పాటు మరో మూడు యాక్సెసరీస్ ను కూడా హానర్ లాంఛ్ చేసింది. హానర్ స్మార్ట్ బ్రేస్ లెట్ 3, హానర్ స్మార్టు స్కేల్, స్మార్ట్ ఎన్విరానమెంట్ మోనిటర్లను లాంఛ్ చేసింది.
ఫిట్ నెస్ ట్రాకర్ల మార్కెట్లో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి హానర్ ఈ స్మార్టు బ్రేస్ లెట్ 3ని విడుదల చేసింది. ఈ కేటగిరీలో హానర్ ఇంతకుముందు పలు ఉత్పత్తులను తీసుకొచ్చినా ఆదరణ పొందలేదు. జూన్ 12 నుంచి దీన్ని హానర్ వెబ్ సైట్లో అమ్మకానికి పెట్టారు. నలుపు, ఆరంజ్, నీలం రంగుల్లో దొరుకుతోంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ తో, అది లేకుండా రెండు వేరియంట్లలో లభిస్తోంది. వేరియంట్ ను బట్టి మన కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.2300 నుంచి రూ.2800 వరకు ఉంది.
హానర్ స్మార్ట్ బ్రేస్ లెట్ 3లో ఏమున్నాయి.
* అమోలెడ్ డిస్ ప్లే
* కంటిన్యూయస్ హార్ట్ రేట్ ట్రాకర్
* స్టెప్స్ కాలిక్యులేటర్
* బర్న్ట్ క్యాలరీస్ కేలిక్యులేటర్
* స్లీప్ డ్యురేషన్
* 50 మీటర్ల లోతున కూడా నీటిలోనూ దీనికి ఏమీ కాదు
* స్విమర్ల సహా స్పోర్ట్సు పర్సన్లందరికీ ఇది మోస్ట్ సూటబుల్
స్మార్టు స్కేల్
ఇది మన బరువుతో పాటు మెటబాలిక్ రేట్, బాడీ ఫ్యాట్, మజిల్ వెయిట్ చెప్తుంది. స్మార్టు ఫోన్లో స్మార్టు స్కేల్ యాప్ వేసుకుని దీన్ని కంట్రోల్ చేయొచ్చు. దీని ధర మన కరెన్సీలో సుమారు రూ.2 వేలు.
స్మార్టు ఎన్విరానమెంట్ మోనిటర్
మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను ఇది మోనిటర్ చేస్తుంది. పీఎం 2.5 పార్టికల్స్ స్థాయిని గుర్తిస్తుంది. టెంపరేచర్, హ్యుమిడిటీ వంటివీ చెప్తుంది. గాల్లోని 300 రకాల ఆర్గానిక్ కాంపౌండ్స్ ని డిటెక్ట్ చేస్తుంది. దీని బ్యాటరీ 5 రోజుల పాటు ఉంటుంది. ఇది జులై 18 నుంచి చైనాలో అమ్మకానికి రానుంది.

జన రంజకమైన వార్తలు