సాంకేతిక పరంగా భారత్ వేగంగా దూసుకెళుతోంది. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీని ఉపయోగించి పనిని సులభతరం చేయడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. దేశంలో ప్రధాన నగరాలన్నిటిని స్మార్ట్‌సిటీలుగా చేయాలనే సంక్పలంతో అధికారులు ముందుకెళుతున్నారు. ఇటీవలే మరికొన్ని నగరాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీలు తయారు చేయడానికి ఎన్నో కొత్త కొత్త మార్గాలను వెతుకుతోంది ప్రభుత్వం. అయితే స్మార్ట్‌సిటీలను మరింత స్మార్ట్‌గా చేసేందుకు ఒక స్ట్రీట్ లైట్ విధానం వచ్చింది. అదే టుంగ్‌స్టా. టెక్నాలజీ ద్వారా నడిచే ఈ వీధి దీపాల విధానం అనుసరిస్తే కచ్చితంగా స్మార్ట్‌సిటీలకు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రిమోట్ ద్వారా..
గోవాకు చెందిన టుంగ్‌స్టా స్టార్టప్ క్లౌడ్ ఆధారంగా పని చేసే కొత్త స్ట్రీట్ లైటింగ్ విధానాన్ని తయారు చేసింది. ఇటీవల వచ్చిన టెక్నాలజీలో ఇది అత్యున్నతమైనది నిపుణుల మాట. అంటే వీధి దీపాలను మనం రిమోట్ కంట్రోల్ ద్వారానే ఆపరేట్ చేయచ్చు. అంతేకాదు దీనిలో ఉండే ఇంటిగ్రేటెడ్ సిరీస్ సెన్సార్లు ట్రాఫిక్ పరిస్థితులను అనలైజ్ చేస్తాయి. ట్రాఫిక్ పరిస్థితులకు తగ్గట్లే తక్కువ లైటింగ్, ఎక్కువ లైటింగ్‌ను అడ్జెస్ట్ చేసుకుంటాయి. దీని వల్ల 64 శాతం వరకు పవర్ సేవింగ్ చేసే అవకాశాలుంటాయని టుంగ్‌స్టా కంపెనీ తెలిపింది. ఇలాంటి టెక్నాలజీ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
రియల్‌టైమ్ డాష్‌బోర్డు
టుంగ్‌స్టా లైట్లు రియల్‌టైమ్ డాష్‌బోర్డు ఆధారంగా పని చేస్తాయి దీన్ని సాంకేతికంగా టుంగ్‌స్టా ప్యానెల్ అంటారు. అంటే వీధుల్లో ఉండే ప్రతి దీపాలను మానిటర్ చేయడానికి, అవి ఎలా వెలుగుతున్నాయో... ఎక్కడ పని చేస్తున్నాయో.. ఎక్కడ పని చేయట్లేదో? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎవరైనా లైట్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారా? ఇలాంటి వివరాలన్ని రియల్‌టైమ్ డాష్‌బోర్డులో ఉంటాయి. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇది వెంటనే ఆపరేటర్లకు వార్నింగ్ పంపిస్తుంది. దీని వల్ల 35 శాతం మెయింట్‌నెన్స్ ఖర్చులు తగ్గుతాయని టుంగ్‌స్టా కంపెనీ తెలిపింది. చాలా నగరాల్లో వీధి దీపాలు నిర్వహణ లోపంతోనే ఉంటాయని కానీ టంగ్‌స్టా ద్వారా ఈ ఇబ్బంది తీరుతుందని ఆ కంపెనీ చెబుతోంది.
త్వరలో అన్ని నగరాల్లో..
భారత్‌లో స్మార్ట్‌సిటీలే లక్ష్యంగా పని చేస్తున్న టుంగ్‌స్టా త్వరలో అన్ని నగరాల్లో విస్తరించాలనేది తమ లక్ష్యమని తెలిపింది. స్మార్ట్‌సిటీస్‌లో పనితీరుని అంచనా వేసిన తర్వాత మిగిలిన నగరాల్లో సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పింది. అయితే టుంగ్‌స్టా కంపెనీ ఇక్కడితో ఆగిపోవట్లేదు. త్వరలోనే వైఫై హాట్‌స్పాట్‌ల ఇంటిగ్రేషన్, అడ్వర్టేజ్‌మెంట్లకు ఎల్ఈడీ సిగ్నేజేస్ చేయాలనే లక్ష్యంతో ఉంది. అయితే తమ ప్రధాన లక్ష్యం స్మార్ట్‌సిటీలను మరింత స్మార్ట్‌గా తయారు చేయడమేనని టుంగ్‌స్టా కంపెనీ తెలిపింది.