• తాజా వార్తలు

ఇక స్కైప్ ద్వారా మీ ఐ.పి. అడ్రస్ సురక్షితం

మీ ఐ.పి. అడ్రస్ ను డిఫాల్ట్ గా దాచివేయనున్న స్కైప్

మీలో ఎంతమందికి స్కైప్ వాడే అలవాటు ఉంది?స్కైప్ ను ఉపయోగించి మనం వీడియో కాలింగ్ చేయవచ్చు కదా! స్కైప్ గ్రూప్ వీడియో కాలింగ్ ను కూడా అనుమతిస్తుందని మనం గత ఆర్టికల్ లో చదివాము కదా! అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే ఉదాహరణ కు మీరు స్కైప్ ను ఉపయోగించి వీడియో కాలింగ్ లేదా గ్రూప్ వీడియో కాలింగ్ ను చేస్తున్నారని అనుకోండి. మీరు ఎవరితోనైతే మాట్లాడుతున్నారో వాళ్ళ కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ లలో మీయొక్క ఐపి అడ్రస్ కనిపిస్తుంది. అంటే మీరు ఏ ఐపి అడ్రస్ నుండి స్కైప్ ను వాడుతున్నారో అది వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ ఇకనుండీ ఆ పరిస్థితి మారబోతోంది. స్కైప్ అందిస్తున్న తన లేటెస్ట్ వెర్షన్ లో మీ యొక్క ఐపి అడ్రస్ దానంతట అదే దాయబడుతుంది. అంటే ఐపి అడ్రస్ కనిపించకపోవడం అనేది స్కైప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ లో డిఫాల్ట్ గా ఉండబోతోంది.

ఈ అప్ డేట్ తో స్కైప్ తన ప్రస్థానంలో మరొక ముందడుగు వేసింది అని చెప్పవచ్చు. మీ యొక్క ఐపి అడ్రస్ రహస్యంగా ఉంచబడుతుంది. కొంతమంది హ్యాకర్ లు  మీ యొక్క ఐడి ని తెలుసుకొని మీ స్కైప్ ఐడి నుండి తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంటారు. కానీ స్కైప్ యొక్క ఈ లేటెస్ట్ అప్ డేట్ తో అలాంటి చర్యలకు కళ్ళెం పడనుంది. తనయొక్క వినియోగ దారులందరినీ స్కైప్ యొక్క సరికొత్త అప్ డేట్ కు వెంటనే మారిపోయే విధంగా తమ పరికరాలలోని యాప్ లను అప్ డేట్ చేసుకోవాల్సిందిగా స్కైప్ తెలియజేస్తుంది. ఈ ఐపి అడ్రస్ అంశం ఆన్ లైన్ లో గేమ్స్ ఆడే గేమర్ ల ద్వారా బాగా ప్రాచుర్యం లోనికి వచ్చింది. మనం స్కైప్ ను వాడేటపుడు మన ఐపి అడ్రస్ ఎవరికీ కనబడకుండా ఎలా ఉంచగలం అనే అంశం పై  సదరు గేమింగ్ కమ్యూనిటీ లో పెద్ద చర్చే నడిచింది. ఇలాంటి వారందరికీ ఈ కొత్త ఫీచర్ ఒక చక్కని అవకాశం గా చెప్పుకోవచ్చు. ఈ గేమింగ్ కమ్యూనిటీ లో ఉన్న వారికి ఈ అప్ డేట్ ఒక ఆశాకిరణం లా కనిపిస్తుంది.

మనం నిశితంగా గమనిస్తే ప్రముఖ వీడియో కాలింగ్ మెసేజింగ్ సర్వీస్ అయిన ఈ స్కైప్ గత నెలనుండీ అనేక అప్ డేట్ లను అందిస్తూ వస్తుంది. ఆండ్రాయిడ్, ios , విండోస్ 10 తదితర ప్లాట్ ఫాం లన్నింటిలో గ్రూప్ వీడియో కాలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోనికి తీసుకు వచ్చింది.ఇంతకుముంది గ్రూప్ వీడియో కాలింగ్ కేవలం వ్యాపార అవకాశాలకు సబ్ స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ లేటెస్ట్ ఫీచర్ వల్ల నాన్ సబ్ స్క్రైబర్ లకు కూడా గ్రూప్ వీడియో కాలింగ్ ఉపయోగించవచ్చు. అవుట్ లుక్ లో షెడ్యూల్ స్కైప్ కాల్స్ ను చేసుకునే విధంగా ఆండ్రాయిడ్ లో స్కైప్ యాప్ ను మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. అంతేకాదు అది తన విండోస్ డెస్క్ టాప్ యాప్  లో స్కైప్ ట్రాన్స్ లేటర్ టూల్ ను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఇంకెన్ని అప్ డేట్ లను ఇది అందించాబోతోందో చూడాలి.

 

జన రంజకమైన వార్తలు