• తాజా వార్తలు

హష్ మీ మాస్క్.. ఇది ఉంటే గుంపులో ఉన్నా ప్రైవేటుగా మాట్లాడుకోవచ్చు


ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడేలా ఆఫీసులోనో.. పబ్లిక్ ప్లేసుల్లోనో.. జర్నీల్లోనో మాట్లాడలేం. మనం ఎంత మెల్లగా మాట్లాడినా ఇతరులు వినే ఛాన్సుంటుంది. మెల్లగా మాట్టాడితే ఫోన్లో అవతలి వ్యక్తికి వినిపించకపోవచ్చు. అలాంటప్పుడు ఫోన్లో మాట్లాడడం చాలా కష్టమవుతుంది. అందుకు పరిష్కారంగా అమెరికా కంపెనీ ఒకటి కొత్త గాడ్జెట్ తీసుకొచ్చింది. దీని సహాయంతో ఎంతమంది మధ్యలో ఉన్నా కూడా పక్కవారికి ఒక్క ముక్క కూడా వినిపించకుండా హాయిగా మనం ఫోన్లో మాట్లాడుకోవచ్చు

త్వరలో ఇండియాకు..


ఒక్కోసారి ఫోన్లో ముఖ్యమైన, వ్యక్తిగతమైన విషయాలు సంభాషించాలంటే మరింత ఇబ్బంది. అయితే ఇలాంటి సమస్యలు ఇక ముందు ఉండవు. కారణం హెడ్‌సెట్‌ మాదిరిగానే మౌత్‌సెట్‌ మార్కెట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అమెరికాలో ఉపయోగిస్తున్న దీనిని 'హష్‌మి మాస్క్‌' అని పిలుస్తున్నారు.

ఎలా పనిచేస్తుంది?


దీన్ని బ్లూటూత్‌ ద్వారా మన స్మార్ట్‌ ఫోన్‌కు కనెక్ట్‌ చేయాలి. ఇయర్‌ఫోన్స్‌ కూడా కనెక్ట్‌ చేసుకుంటే నిరంతరంగా, పక్కవారికి వినిపించకుండా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అమెరికాలో వినియోగంలో ఉన్న ఈ హష్‌మి మాస్క్‌ త్వరలోనే మనదేశ మార్కెట్‌లోకి రానుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చెవిలో హెడ్‌సెట్స్‌ కనిపిస్తున్నాయి.. ఇది కనుక అందుబాటులోకి వస్తే ఎవరిని చూసినా ముఖానికి ఇది కట్టుకునే కనిపిస్తారేమో.

జన రంజకమైన వార్తలు