• తాజా వార్తలు

ఐఫోన్ యూజర్ల కు యాడ్ ఆన్ మెమరీ + బాటరీ ప్యాక్ తెచ్చిన సాన్ డిస్క్

ప్రముఖ స్టోరేజ్ సొల్యూషన్ కంపెనీ అయిన సాన్ డిస్క్ ఐ ఫోన్ కోసం అదనపు స్టోరేజ్ కేస్  మరియు బాటరీ ప్యాక్ ను లాంచ్ చేసింది. దీనిని సాన్ డిస్క్ ixpand మెమరీ కేస్ అని పిలుస్తున్నారు.

కేవలం ఐ ఫోన్ 6 మరియు ఐ ఫోన్ 6 s వినియోగదారులకు మాత్రమే ఈ ఐసాన్ డిస్క్ ఐ ఫోన్  మెమరీ కేస్ తయారు చేయబడింది. మిగతా ఏ వెర్షన్ లకూ ఇది సపోర్ట్ చేయదు. ఈ మెమరీ కేస్ యొక్క అడుగు భాగం ద్వారా  లైటనింగ్ పోర్ట్ కు కనెక్ట్ చేయబడి  ఐ ఫోన్  కి చుట్టూ ఉండేలా ఏర్పాటు చేయబడింది. ఇలాంటి స్టోరేజ్  పరికరాలు అనేకం ఉన్నప్పటికీ లైటినింగ్ పోర్ట్ ద్వారా ఫ్లాష్ డ్రైవ్ ను కనెక్ట్ చేయడం లో ఏమంత సౌకర్యంగా లేవు. కానీ ఈ సాన్ డిస్క్ ixpand మెమరీ కేస్ ఈ అసౌకర్యాన్ని సౌకర్యoగా మార్చేసింది. ఇది మొత్తం మూడు రకాల స్టోరేజ్  ఆప్షన్ లను అందిస్తుంది. అవి 32 GB, 64 GB, 128GB. వీటితో పాటు భద్రపరచబడిన మీడియా సమాచారాన్ని ఆక్సెస్ చేసేందుకు వీలుగా ఒక ios యాప్ ను కూడా విడుదల చేసింది.

దీనికి అదనంగా సాన్ డిస్క్ ఒక యాడ్ ఆన్ 1900 mAh బాటరీ ను కూడా లాంచ్ చేసింది. ఇది  మెమరీ కేస్ కు అటాచ్ చేయబడి ఉంటుంది. ఈ ix pand మెమరీ కేస్ మొత్తం నాలుగు రంగులలో లభిస్తుంది. అవి గ్రే,  నీలి రంగు, మింట్ మరియు ఎరుపు

       దీని ధర స్టోరేజ్ ఆప్షన్ లను బట్టి ఉంటుంది

  32 GB             Rs 4000

  64 GB             Rs 6,700

  128  GB          Rs 8,700

     వీటి తో పాటు యాడ్ ఆన్ బ్యాటరీ ప్యాక్ ను విడిగా కొనవలసి ఉంటుంది. దీని ధర సుమారు 2,700 రూపాయలు ఉంటుంది.

 

జన రంజకమైన వార్తలు