• తాజా వార్తలు

మనం వాడే మైక్రో ఎస్ డి కార్డు లు హై ఎండ్ కాకపోతే వచ్చే ఇబ్బందులు

మన స్మార్ట్ ఫోన్ లలో ఉండే ఫ్రీ స్పేస్ కు సంబందించిన సమస్యలను మనం తరచుగా ఎదుర్కొంటూ ఉంటాము. తరచూ మన స్మార్ట్ ఫోన్ లో ఉండే ఫ్రీ స్పేస్ అయిపోవడం ఏదైనా కొత్త యాప్ లను ఇన్ స్టాల్ చేయాలన్నా లేక కొత్త ఫైల్ లను అందులో ఉంచాలన్నా అప్పటికే ఉన్న యాప్ లను కానీ ఫైల్ లను కానీ డిలీట్ చేయడం చేస్తూ ఉంటాము. ఇలా డిలీట్ చేసే వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఉండి ఉండవచ్చు. అలాంటపుడు అది కొంచెం ఇబ్బంది కలిగించే అంశమే కదా! అది మాత్రమే గాక కొన్నిసార్లు మన స్మార్ట్ ఫోన్ లో స్పీడ్ చాలా తక్కువగా ఉంటుందనీ  ఫోన్ హ్యాంగ్ అవుతుందనీ కొన్ని యాప్ లు ఫ్రీజ్ అవుతున్నాయనీ కంప్లయింట్ చేస్తూ ఉంటాము. ఈ సమస్యలన్నింటికీ ముఖ్య కారణం మనం వాడే మెమరీ కార్డు లు. అవును మన స్మార్ట్ ఫోన్ లలో ఉపయోగించే ఎస్ డి కార్డులు ఫోన్ యొక్క పనితీరును స్లో చేయడం తో పాటు మరెన్నో సమస్యలకు మూలకారణం అవుతాయి. అంటే మనం వీటిని ఉపయోగించేటపుడు హై ఎండ్ కార్డు లానే వాడాలి. లేకపోతే ఎన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

చాలా మంది వేలకొద్దీ ఖర్చు పెట్టి స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తారు కానీ క్వాలిటీ మెమరీ కార్డు లను వాడాలి అనే సంగతి ని మరచిపోయి తక్కువ ధరలో లభించే మెమరీ కార్డు లను వాడతారు. ఆ ఏముందిలే మెమరీ కార్డు లే కదా! అని అనుకుంటారు. కానీ ఆ మెమరీ కార్డు లే అసలు సమస్యలన్నీ సృష్టిస్తాయనే విషయం మనలో ఎంతమందికి తెలుసు? తక్కువ కెపాసిటీ ఉండే కార్డు లలో ఉండే స్పేస్ తొందరగా అయిపోతుంది. మనం స్మార్ట్ ఫోన్ లను ఉపయోగించేపుడు మెమరీ మొత్తం ఉపయోగించకుండా కొంత మెమరీ ని ఫ్రీ గా ఉంచుకోవడం ఎల్లపుడూ చేయవలసిన పని. దీనివలన ఫోన్ యొక్క పనితీరులో ఉండే వేగం మండగించకుండా ఉంటుంది. ఈ తక్కువ క్వాలిటీ మెమరీ కార్డు లను ఉపయోగించడం వలన ఫోన్ లలో ఉండే మెమరీ తొందరగా పూర్తీ అయిపోతూ ఫోన్ యొక్క పనితీరుపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మీ దగ్గర 4 GB మెమరీ కార్డు ఉంది అనుకోండి. మీరు ఇన్ స్టాల్ చేయవలసిన ఫైల్ లను చూసుకుంటే అది కొంచెం అటూ ఇటూ గా 4 GB కి సరిపోను వస్తుంటే అందులో నింపివేయకూడదు. వెంటనే 8 GB మెమరీ కార్డు ను ఉపయోగించాలి. అంటే ఎప్పటికప్పుడు మన మెమరీ కార్డు లో ఫ్రీ స్పేస్ ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. దీనివలన మరొక ఉపయోగం ఏమిటంటే మనం మొదట్లో చెప్పుకున్నట్లు హై కెపాసిటీ మెమరీ కార్డు లను ఉపయోగించడం వలన యాప్ లను ఫైల్ లను డిలీట్ చేసే అవసరం ఉండదు.

ఈ తక్కువ ధరలో లభించే మెమరీ కార్డు లను ఉపయోగించడం వలన వచ్చే మరొక ప్రమాదం డేటా రిస్క్. అవును ఈ మెమరీ కార్డు లో నింపిన ప్రతీ చిన్న ఇన్ఫర్మేషన్ ( డేటా ) యొక్క ప్రైవసీ రిస్క్ లో ఉన్నట్లే,   మీ ఫైల్ లు సురక్షంగా ఉన్నాయా లేదా అనే విషయం లో ఏ విధమైన గ్యారంటీ లేదు. ఎక్స్ రే లను ఉపయోగించి చెక్ చేసేటపుడు కొన్ని కార్డు లు సమస్యలను సృష్టిస్తాయి. ఉదాహరణకు ఎయిర్ పోర్ట్ లలో కానీ లేక పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లలో కానీ మనం ఎంటర్ అయినపుడు మనలను చెక్ చేస్తూ ఉంటారు. ఈ తక్కువ క్వాలిటీ ఉన్న కార్డు లు అలాంటి చెకింగ్ లకు కూడా లొంగిపోయి మీ డేటా ను రిస్క్ లో ఉంచే ప్రమాదం ఉంది. అదే హై క్వాలిటీ మెమరీ కార్డు లను ఉపయోగిస్తే ఇలాంటి ప్రమాదం ఉండదు. ఇవి ఏ రకమైన కిరణలకు అయినా లొంగి పోకుండా మీ డేటా ను సురక్షంగా ఉంచుతాయి.

ఇక తర్వాత చెప్పుకోవలసిన విషయం స్పీడ్ గురించి. అత్యంత హై క్వాలిటీ హార్డ్ వేర్ ను కలిగిఉన్నా సరే కొన్ని ఫోన్ లు స్లో అవడం లాంటి కంప్లయింట్ లను మనం తరచుగా చూస్తూ ఉంటాము. వీటికి కారణం కూడా మెమరీ కార్డు లే. ప్రతీసారీ వినియోగదారుడు డేటా ను కార్డు లోనికి కాపీ చేయాలి అనుకుంటాడు. దీనివలన ఫోన్ హ్యాంగ్ అయి తక్కువ ప్సీద్ ను అందిస్తుంది. మనమేమో హార్డ్ వేర్ ప్రాబ్లం అని అనుకుంటాము. అంతేగాక వీడియో రికార్డింగ్ చేసేటపుడు కంపాటిబిలిటీ సమస్యలు కూడా వస్తాయి. ఉదాహరణకు హై రిసోల్యూషణ్ వీడియో లను రికార్డు చేసేటపుడు అన్ని కార్డు లూ ఫుల్ HD లేదా HD ని సపోర్ట్ చేయవు. అంటే మీ ఫోన్ మంచిదే అయినా మెమరీ కార్డు వలన మీరు రికార్డు చేయలేకపోతున్నారు అన్నమాట.

చూసారు కదా! హై ఎండ్ కార్డు లను వాడకపోవడం వలన ఎన్ని ఇబ్బందులో. ఈ విషయం లో సాన్ డిస్క్ అనేక రకాల మెమరీ కార్డు లను తయారుచేస్తుంది. ఇవి UHS-1 , షాక్ ప్రూఫ్, టెంపరేచర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఏక రే ప్రూఫ్ లలో లభిస్తాయి. దాదాపు అన్ని అవసరాలకు తగిన ఎస్ డి కార్డు లను సాన్ డిస్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక కాప్సితి ల విషయానికొస్తే ఇదే 16 GB నుండే 200 GB వరకూ ఉండే కార్డు లనుజ్ ఉత్పత్తి చేస్తుంది. వీటిధర రూ 524/- ల నుండీ రూ 5699/- ల వరకూ ఉంటాయి

జన రంజకమైన వార్తలు