• తాజా వార్తలు

2017 లో స్మార్ట్ ఫోన్ లలో రానున్న కీలక మార్పులు

 

టెక్నాలజీ రోజురోజుకీ మారిపోతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే, మనం ఎప్పుడూ చర్చించుకునేదే. అయితే ఇప్పటివరకూ టెక్నాలజీ అందించిన ఉత్పాదన లలో స్మార్ట్ ఫోన్ లది ఒక విశిష్టమైన స్థానం. ఎందుకంటే దాదాపు అన్ని పనులకీ స్మార్ట్ ఫోన్ లపై ఆధారపడవలసిన పరిస్థితి నేడు నెలకొని ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ల శకం మొదలైన దగ్గరనుండీ ఇప్పటివరకూ ఇవి అనేక మార్పులకు లోనయ్యి మానవ జీవన విధానాలను కూడా మారుస్తున్నాయి. ఫీచర్ ల విషయం లోనూ, డేటా విషయం లోనూ, సెక్యూరిటీ విషయం లోనూ, స్టోరేజ్ విషయం లోనూ ఇలా అనేక విషయాలలో స్మార్ట్ ఫోన్ లు వాటికవే సాటి గా నిలబడుతున్నాయి. కొన్ని కొన్ని సందర్భాలలో PC లకు ప్రత్యామ్నాయాలు గా మారాయంటే వీటి విస్తృతి ఏ స్థాయి లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యం లో 2017 వ సంవత్సరం లో ఈ స్మార్ట్ ఫోన్ లలో రానున్న సరికొత్త  ట్రెండ్ ల గురించి ఈ ఆర్టికల్ లో చర్చించడం జరిగింది.

1. సరికొత్త డిజైన్ లు

స్మార్ట్ ఫోన్ లలో సరికొత్త డిజైన్ లు రానున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆపిల్ తన పాత ఐ ఫోన్ యొక్క డిజైన్ లోనే చిన్న చిన్న మార్పులు చేసి సరికొత్తగా అందించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సామ్సంగ్ కూడా ఫోల్దింగ్ స్మార్ట్ ఫోన్ ను తీసుకురానుంది అనే ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ జరగవచ్చు లేదా జరగక పోవచ్చు కానీ స్మార్ట్ ఫోన్ లు తమ డిజైన్ లలో సరికొత్త మార్పులకు గురవుతున్నాయి అనే మాట వాస్తవం. ఏదో కొత్తగా చూడబోతున్నాం అన్నది నిజం.

ఈ డిజైన్ లలో మార్పు అనే ట్రెండ్ ఇప్పటికే మొదలైంది అని చెప్పవచ్చు.మోటో Z మరియు LG G5 స్మార్ట్ ఫోన్ లు గూగుల్ యొక్క డిఫంట్ ప్రాజెక్ట్ ఎరా తో ప్రభావితం అయినట్లు వాటి డిజైన్ లను చూస్తే తెలుస్తుంది. లెనోవా యొక్క C ప్లస్ స్మార్ట్ ఫోన్ ఫోల్దింగ్ చేయబడేది గా ఉండి వాచ్ లా ధరించడానికి వీలుగా ఉంటుంది. LG మరియు సామ్సంగ్ లు కూడా ఫోల్దింగ్ డిజైన్ లపై దృష్టి పెట్టాయి.

2. ఫాస్టర్ చిప్స్

గ్రాఫిక్స్ మరింత స్మూత్ గా మారడం వలన ఈ సంవత్సరం వచ్చే ఫోన్ లలో అప్లికేషను లు మరింత వేగంగా రన్ అవనున్నాయి. స్నాప్ డ్రాగన్ తన 835 ప్రాసెసర్ గురించి ఇప్పటికే ప్రకటించింది.ఇది దాదాపు అన్ని టాప్ కంపెనీల ఆండ్రాయిడ్ మొబైల్ లలోనూ ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. కొన్ని స్మార్ట్ ఫోన్ లు మీడియా టెక్ హీలియో X30 ప్రాసెసర్ ను కూడా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో మొబైల్ ప్రాసెసర్ లలోనే అత్యధికంగా 10 CPU కోర్ లు ఉంటాయి. ఇలా స్మార్ట్ ఫోన్ లు తమ ప్రాసెసర్ లపోవేర్ ను క్రమంగా పెంచుకోవడం ద్వారా ప్రదర్శన లో pc ల స్థాయి కి మెల్లగా చేరుకుంటున్నాయి.

3. వర్చ్యువల్ రియాలిటీ

మొబైల్ ల పనితీరును స్పీడ్ అప్ చేయడం అనే ప్రక్రియ వలన అవి వర్చ్యువల్ రియాలిటీ ని కూడా రన్ చేయగలగిన కెపాసిటీ ని కలిగి ఉంటున్నాయి. హ్యాండ్ సెట్ లను గూగుల్ డే డ్రీం లో ప్లగ్ చేసి VR హెడ్ సెట్స్ ద్వారా మూవీ లను చూడడం, గేమ్ లను ఆడడం మరియు VR ప్రపంచం లో విహరించడం లాంటివి చేయవచ్చు.

ప్రస్తుతానికి ఈ VR సామ్సంగ్ గాలక్సీ S7 లాంటి కొన్ని హ్యాండ్ సెట్ లకు మాత్రమే పరిమితం అయ్యి ఉంది. కానీ వచ్చే సంవత్సరానికల్లా హై ఎండ్ ఫోన్ లతో పాటు అన్ని మధ్య తరగతి స్మార్ట్ ఫోన్ లలోనూ ఈ వర్చ్యువల్ రియాలిటీ అనేది అందుబాటులోనికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

4. వేగవంతమైన LTE

సరికొత్త ఆధునిక టెక్నాలజీ ల ద్వారా LTE అనేది వేగం పుంజుకోనుంది.  సామ్సంగ్ గాలక్సీ S7 మరియు ఆపిల్ ఐ ఫోన్ 7 లాంటి స్మార్ట్ ఫోన్ లు తమ LTE నెట్ వర్క్ లపై గరిష్టంగా 600 Mbps ( బిట్స్ పర్ సెకండ్) వేగంతో డౌన్ లోడ్ చేయగలవు మరియు 150 Mbps వేగం తో అప్ లోడ్ చేయగలవు. అయితే ఈ డౌన్ లోడ్ స్పీడ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ X16 మోడెమ్ ద్వారా 1 Gbps కు చేరుకోనుంది. ఈ స్థాయి లో స్పీడ్ ను అందుకోవడం అనేది ఆయా మొబైల్ కారియర్ ల నెట్ వర్క్ పై కూడా ఆధారపడి ఉంటుంది.

5. USB- C

ఆండ్రాయిడ్ పరికరాలో ఉండే మైక్రో USB 2.0 స్థానం లో ఈ సంవత్సరం USB- C రానుంది.ఇది చాలా విశిష్టం గా ఉండనుంది.ఛార్జింగ్ కు మాత్రమే గాక అంతకు మించి అనే రీతిలో ఇది పనిచేయనుంది. మొబైల్ పరికరాలను హై డెఫినిషన్ మానిటర్ లకు, హెడ్ ఫోన్ లకూ, ఫ్లాష్ డ్రైవ్ లకూ మరియు ఎక్స్ టర్నల్ స్టోరేజ్ డివైస్ లకూ ఇది కనెక్ట్ చేయగలదు.

6. వైర్ లెస్ ఆడియో

వైర్ లెస్ ఆడియో పరికరాలు రానున్నాయి. ఇకపై స్మార్ట్ ఫోన్ లలో హెడ్ సెట్ జాక్ లు మాయం అయ్యి వాటి స్థానం లో వైర్ లెస్ ఆడియో లు రానున్నాయి. కొన్ని లీ ఎకో మరియు మోటోరోలా స్మార్ట్ ఫోన్ లలో ఇప్పటికే ఈ వైర్ లెస్ ఆడియో డివైస్ లు వచ్చి ఉన్నాయి.

7. వేగవంతమైన చార్జింగ్

ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ USB- C కేబుల్ ల ద్వారా స్మార్ట్ ఫోన్ ల యొక్క చార్జింగ్ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. ఎందుకంటే ఇది బాటరీ కి ఎక్కువ పవర్ ను క్యారీ చేయగలదు. ఇదే గాక క్వాల్ కాం క్విక్ ఛార్జ్ 4 లాంటి టెక్నాలజీ ల వలన కేవలం 5 నిమిషాల చార్జింగ్ కే ఫోన్ లు 5 గంటల పాటు పనిచేయనున్నాయి. ఈ టెక్నాలజీ వచ్చే సంవత్సరం రానుంది.

8. డివైస్ స్మార్ట్ లు

లెనోవా యొక్క ఫాబ్ 2  ప్రో అగ్మెంటేడ్ రియాలిటీ స్మార్ట్ ఫోన్ లు వస్తువులను గుర్తు పెట్టుకోగలవు, రూమ్ లను మ్యాప్ అవుట్ చేయగలవు హ్యాండ్ సెట్ యొక్క స్క్రీన్ కు దగ్గర లో ఉన్న వస్తువులకు సంబందించిన సమాచారాన్ని ఇవ్వగలవు. స్మార్ట్ ఫోన్ లు వినియోగదారుని అనుభవాన్ని ఎలా మార్చనున్నాయి అనేదానికి ఇది ఒక ఉదాహరణ.

9. బ్లూ టూత్ 5

ఇప్పటివరకూ వాడుతున్న బ్లూ టూత్ 4.2 వెర్షన్ కు సంబందించినది. కానీ దీని తర్వాత రానున్న బ్లూ టూత్ 5 దీనికంటే రెండు రెట్లు ఎక్కువ స్పీడ్ తోనూ 4 రెట్లు ఎక్కువ రేంజ్ తోనూ రానున్నాయి. దీని రేంజ్ సుమారు 500 మీటర్ ల వరకూ ఉండనుంది, అంటే ఎక్కువ దూరాల నుండి కూడా మీరు మీ మొబైల్ లను ఆపరేట్ చేయవచ్చు అన్నమాట.

10 స్టోరేజ్

స్మార్ట్ ఫోన్ లలో ఎక్స్ ట్రా స్టోరేజ్ అనేది వినియోగదారులు ఎప్పుడూ కోరుకునేదే కదా! ప్రస్తుతం ఉన్న టాప్ స్మార్ట్ ఫోన్ లు తమ ఇంటర్నల్ స్టోరేజ్ ను గరిష్టం గా 256  GB గానూ SD స్టోరేజ్ ను 500 GB గానూ కలిగిఉన్నాయి. కానీ సాన్ డిస్క్ కంపెనీ ఈ సంవత్సరం 1 TB ప్రోటో టైపు SD కార్డు ను ప్రవేశపెట్టింది, కాబట్టి దానికి తగ్గట్లు స్మార్ట్ ఫోన్ ల యొక్క స్టోరేజ్ లో కూడా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.  

"

జన రంజకమైన వార్తలు