బయో మెట్రిక్స్ లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ లో సెక్యూరిటీ క్లియరెన్సులో ఐరిస్ స్కాన్ వాడకం మూడు రెట్లు అధికంగా ఉందట. ఐరిస్ స్కాన్ వాడకం ప్రపంచవ్యాప్తంగా 3 శాతం ఉండగా ఇండియాలో అది 9 శాతంగా ఉంది. ఫింగర్ ప్రింటు టెక్నాలజీ విషయంలో మనం రెండో స్థానంలో ఉన్నా. చైనీయులు 40 శాతంతో ముందుండగా ఇండియన్స్ 31 శాతం మంది దీనికి ఓటేస్తున్నారు. మన తరువాత అరబ్ ఎమిరేట్స్ 25 శాతంతో మూడో స్థానంలో ఉంది.
గుర్తింపు చూపించడానికి పత్రాలు, పాస్ వర్డులను ప్రపంచంలోని ఇతర దేశాల్లో అధికంగా వాడుతుండగా ఇండియాలో మాత్రం బయోమెట్రిక్ విధానాలు విరివిగా వాడుతున్నారు.
ఆసియా దేశాలే బెటర్
ఈ విషయంలో యూరోపియన్ దేశాలు మన కంటే ఎంతో వెనుకబడి ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. స్మార్టు ఫోన్ బ్యాంకింగును అడాప్ట్ చేసుకోవడంలో జర్మన్లు కేవలం 4 శాతం మాత్రమే ఉండగా ఆసియా దేశాలైన హాంకాంగ్ లో అది 9 శాతం, అరబ్ ఎమిరేట్సులో 15 శాతం ఉంది.
ఆర్థిక సలహాలకు కంప్యూటర్లే బెటర్
ఇక ఆర్థిక సలహాల విషయంలో మనుషుల కంటే కంప్యూటర్లనే ఎక్కువగా నమ్మొచ్చని భారతీయులు చెప్తున్నారు. 50 శాతం మంది ఇండియన్సుది ఇదే మాట. కానీ... బ్రిటన్ 21 శాతం, కెనడాలో 11 శాతం మాత్రమే దీన్ని అంగీకరిస్తున్నారు. వారింకా ఈ విషయంలో టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడడం లేదు.
మరి డాటాకు గ్యారంటీ ఉందా?
అయితే... బయోమెట్రిక్ సిస్టమ్ లో ఇంకో ఇబ్బంది కూడా ఉందంటున్నారు నిపుణులు. రీసెంటుగా ఫోన్ నంబరుకు ఆధార్ సంఖ్య అనుసంధానం అని చెప్తూ ఫింగర్ ప్రింట్లు తీసుకుని అనుమతి లేకుండా ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసిన విషయం వెల్లడైన నేపథ్యంలో బయోమెట్రిక్ వ్యవస్థలో ఉన్న ఇబ్బందులు చర్చకొస్తున్నాయి. అంతేకాదు.. బయో మెట్రిక్ బేస్డ్ ఆధార్ సమాచారం వెబ్ సైట్లలో పెట్టేస్తుండడం వంటివీ కాస్త ఆలోచించాల్సిందే.
అయితే, సరైన సేఫ్టీ మెజర్స్ ఉంటే బయో మెట్రిక్ అడాప్షన్ మంచి పరిణామమే.