ఇండియా లోని ప్రముఖ కంపెనీలకు తన ఎంటర్ ప్రైజ్ అప్లికేషను లను అమ్మడం లో గూగుల్ చాలా వేగంగా అడుగులు వేస్తుంది.తన యొక్క గొప్ప సాంకేతిక వ్యవస్థలను తన వ్యాపార అభివృద్ది కి ఉపకరించే విధంగా ఒక ఇన్సెంటివ్ ప్రోగ్రాం ను గూగుల్ లాంచ్ చేసింది. వ్యాపారాలలో గూగుల్ యాప్స్ ను ఉపయోగించుకుంటున్న వారి దగ్గర గూగుల్ కొంత ఛార్జ్ వసూలు చేస్తుంది.ఒకవేళ ఆయా కంపెనీ లు వేరే ప్రొవైడర్ ల పై ఆధారపడి పనిచేస్తున్నా సరే వాటి కాంట్రాక్టు అయిపోయిన వెంటనే గూగుల్ యాప్స్ ఉపయోగించే విధంగా ప్రణాళికలు రచిస్తుంది.అంతేగాక కొన్ని అధిక ధరలో లభిస్తున్న యాప్ లకు కూడా ధర తగ్గ్గించి గూగుల్ యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కంపెనీలకు 70% వరకూ ఆదా లభించే విధంగా గూగుల్ ప్రకటించింది.దీనికి ప్రధాన కారణం మైక్రో సాఫ్ట్ నుండి వస్తున్న విపరీతమైన పోటీ.ఈ మధ్యనే ఇండియా లో డేటా సెంటర్ లను ఏర్పాటు చేయడం ద్వారా భారతీయ మార్కెట్ లో అత్యధిక వాటాను మైక్రో సాఫ్ట్ సొంతం చేసుకుంది.దీనితో మైక్రోసాఫ్ట్ కు పోటీగా గూగుల్ తన ఎంటర్ ప్రైజ్ అప్లికేషను లను అమ్మకానికి పెట్టింది. ప్రపంచం లో గూగుల్ కు అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న మార్కెట్ ఇండియానే.ఎందుకంటే సుమారు 2 మిలియన్ ల వ్యాపారాలలో గూగుల్ పెయిడ్ ఎంటర్ ప్రైజ్ అప్లికేషను లను ఇండియా లో ఉపయోగించుకుంటున్నారు.ప్రపంచంలోనే డెవలపర్ ల జనాభాలో రెండవ స్థానం లో ఉన్న ఇండియా తర్వాతి తరం సాఫ్ట్ వేర్ కంపెనీ లకు ఒక గమ్యస్థానం గా మారబోతోంది.ఈ నేపథ్యం లో సులభంగా ఉపయోగించగలిగే క్లౌడ్ కంప్యూటింగ్ టూల్స్ ను తరవాతి తరం కంపెనీ లకు అత్యంత తక్కువ ధర లకే అందించడం ద్వారా ఆయా కంపెనీలతో వ్యాపార భాగస్వామ్యం పెట్టుకోవాలని గూగుల్ భావిస్తుంది.దేశం లోని టాప్ స్టార్ అప్ కంపెనీలు, ఈ కామర్స్ కంపెనీలు ఇప్పటికే గూగుల్ యొక్క వినియోగదారులు కాగా తాజాగా హీరో మోటో కార్పొరేషన్,బాంబే డైయింగ్,మరియు వెల్స్పన్ గ్రూప్ కూడా సంతకం చేసినట్లు గూగుల్ ప్రకటించింది. దేశంలోని ఎకో సిస్టమ్స్ కు సంబందించిన స్టార్ట్ అప్స్ విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో కొత్త కొత్త వ్యాపారాలను,తక్కువ చరిత్ర ఉన్న వ్యాపారాలను గూగుల్ తన టార్గెట్ గా చేసుకుంది.2016 లో 1000 భారతీయ స్టార్ట్ అప్ లకు 20,000 డాలర్ ల సహాయాన్ని ప్రకటించడం ద్వారా గూగుల్ తన ప్రణాలిక కు తెర తీసింది. |