స్మార్ట్ ఫోన్లు ఎంత అత్యాధునికమైనవైనా ఫీచర్ ఫోన్లతో పోల్చినప్పుడు ఒక విషయంలో ఇప్పటికీ అవి వెనుకబడే ఉన్నాయి. నిత్యం కొత్తకొత్త ఫీచర్లతో ఫోన్లు వస్తున్నా బ్యాటరీ సామర్థ్యం మాత్రం తక్కువగానే ఉంటుంది. స్మార్ట్ ఫోన్లలో ఫీచర్లు పెరిగే కొద్దీ, ఇంటర్నెట్ వాడకం ఎక్కువయ్యే కొద్దీ, స్క్రీన్ పెద్దదయ్యే కొద్దీ బ్యాటరీ వినియోగం ఎక్కువవుతుంది. దీంతో ఇప్పుడు 2500ఎంఏహెచ్ అంతకంటే ఎక్కువ సామర్థ్యమున్న బ్యాటరీలు వస్తున్నా ఏ మూలకూ చాలడం లేదు. 24 గంటల పాటు ఛార్జింగ్ పెట్టకపోయినా పనిచేసే స్మార్ట్ ఫోన్లు కనిపించడమే లేదు. ఏవో కొన్ని కంపెనీలు 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్లను మార్కెట్లోకి తెచ్చినా స్లిమ్ గా లేకపోవడం.. బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఆ మోడళ్లు ఆదరణ పొందలేదు. కొత్తగా మార్కెట్లోకి రానున్న ఫోన్ ఒకటి బ్యాటరీ సమస్యను చాలావరకు పరిష్కరించబోతోంది. 9000ఎంఏహెచ్ బ్యాటరీతో చైనా కంపెనీ 'మకూక్స్ ' ఎక్స్ 1 పేరుతో అత్యంత సమర్థమైన ఫోన్ ను లాంఛ్ చేసింది. ఎంతగా వాడినా కూడా కనీసం అయిదు రోజులు ఛార్జింగ్ ఉంటుందని సంస్థ చెబుతోంది. దీని ధర ఇంకా ప్రకటించలేదు. ఇవీ ఎక్స్ 1 విశేషాలు..
|