• తాజా వార్తలు

చికెన్ తింటూ ఛార్జింగ్ చేసుకోండి KFC సరికొత్త ప్రయోగం

లంచ్ బాక్స్ చార్జర్ .... ఈ పేరే కొత్తగా అనిపిస్తుంది కదా? అయితే ఈ స్టొరీ చదవండి మరింత కొత్తగా అనిపిస్తుంది. ప్రముఖ చికెన్ వ్యాపార సంస్థ అయిన KFC ఈ సరికొత్త ప్రయోగానికి నాంది పలికింది. బ్లింక్ డిజిటల్ అనే ఏజెన్సీ తో ఒప్పందం కుదుర్చుకున్న Kfc “వాట్ ఎ బాక్స్ “ అనే సరికొత్త లంచ్ బాక్స్ ను అవిష్కరించబోతోంది. ఈ బాక్స్ లో 5 ఇన్ 1 మీల తో పాటు ఫోన్ ను ఛార్జ్ చేసుకునే వీలుగా ఒక పవర్ బ్యాంకు కూడా ఉంటుంది. వినియోగదారులకు ఒక పరిపూర్ణ భోజనం భుజించిన అనుభూతిని సరసమైన ధరలలో అందించడానికి KFC ఈ 5 ఇన్ 1 లంచ్ బాక్స్ ను ఈ మార్చ్ లో ప్రవేశ పెట్టింది. దీనికి పవర్ బ్యాంకు ను జోడించి వాట్ ఎ బాక్స్ రూపం లో అందిస్తుంది. ఇది ప్రస్తుతానికి ఢిల్లీ మరియు ముంబై లలో మాత్రమే లభిస్తుంది. మెల్లమెల్లగా దేశం లోని అన్ని నగరాలకూ ఇది విస్తరిస్తుంది.

“ఈ వాట్ అ బాక్స్ ను లాంచ్ చేయడం తో మేము మరొక అడుగు ముందుకు వేసాము. మా లంచ్ బాక్స్ లో మరొక అంశం వచ్చి చేరింది. మనలో ప్రతి ఒక్కరూ రోజులో ఎక్కువ మొత్తం స్మార్ట్ ఫోన్ లతో గడుపుతున్నారనేది మనందరికీ తెలిసిన విషయమే. ఛార్జింగ్ అయిపోవడం అనేది మనందరం ఎదుర్కొనే సమస్యే. మా ఈ సరికొత్త ఉత్పాదనతో ఆ సమస్యకు కొంతవరకూ పరిష్కారం మా వంతు మేము కనుగోన్నట్లే” అని KFC ఇండియా చీఫ్ లూయిస్ రూయిజ్ అన్నారు.

బ్లింక్ డిజిటల్ యొక్క సహా వ్యవస్థాపకుడైన దూజ్ రామ్ చందాని మాట్లాడుతూ “ నేడు మనిషికి తిండి ఎంత అవసరమో స్మార్ట్ ఫోన్ కూడా అంటే అన్న రీతిలో స్మార్ట్  ఫోన్ ల వినియోగం పెరిగి పోయింది. మనం ఏదైనా మీటింగ్ మధ్యలో కానీ భోజనం మధ్యలో కానీ ఉన్నపుడు లో బాటరీ సిగ్నల్ అనేది మనకు కొంచెం ఇబ్బందికరం గా ఉంటుంది. అలాంటి సమయం లో మా ఈ ఉత్పాదన అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

వీరి వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ లంచ్ బాక్స్ తో పాటు పవర్ బ్యాంకు అంటే కొంచెం కొత్తగానే ఉంది కదా! పోటీనా మజాకా! భవిష్యత్ లో ఇంకెన్ని వింతలు  చూడవలసి వస్తుందో!

 

జన రంజకమైన వార్తలు