'ఆండ్రాయిడ్ 6.0 మార్షమాలో' క్రమంగా పాపులర్ అవుతోంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న డివైస్ లను వాడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గూగుల్ ప్లే డిస్ట్రిబ్యూషన్ డాటా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆండ్రాయిడ్ డివైస్‌లలో మార్షమాలో ఓఎస్ కలిగిన యాక్టివ్ డివైస్‌లు ఇప్పుడు దాదాపు 4.6 శాతం వరకు ఉన్నాయని తెలిసింది. ఏప్రిల్ 4 వరకు తీసుకున్న ఈ సమాచారం ప్రకారం లాలీపాప్, కిట్ కాట్ డివైస్ ల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందట. ఇక విచిత్రమేంటంటే మార్చి 15 నాటికి కేవలం 2.3 శాతం వాటా మాత్రమే ఉన్న మార్షమాలో 20 రోజుల్లోనే రెట్టింపయింది. కాగా గతేడాది మార్ష్‌మాలో విడుదలైన నెలలో ఈ శాతం కేవలం 0.3 గానే ఉంది. ఈ క్రమంలో కేవలం కొద్ది నెలల్లోనే ఇంత మొత్తం శాతానికి ఆండ్రాయిడ్ మార్షమాలో విస్తరించడం పట్ల టెక్ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజా లెక్కల ప్రకారం మొత్తం డివైస్‌లలో లాలిపాప్ ఉన్నవి 35.8 శాతం కాగా, 33.4 శాతం డివైస్‌లలో కిట్‌క్యాట్ ఉంది. అదేవిధంగా 21.3 శాతం డివైస్‌లలో జెల్లీబీన్, 2.2 శాతం డివైస్‌లలో ఐస్‌క్రీం శాండ్‌విచ్, 2.6 శాతం డివైస్‌లలో జింజర్‌బ్రెడ్, 0.1 శాతం డివైస్‌లలో ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌లు రన్ అవుతున్నాయి. ఈ లెక్కన కొద్ది నెలల్లోనే లాలీపాప్ ను దాటుకుని మార్షమాలో టాప్ లో నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే... ఆ తరువాత కొత్త వెర్షన్ కోసం గూగుల్ అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టడంతో ఇది ఎంతకాలం మనుగడ సాగిస్తుందన్నది అనుమానమే. ఏ ఆండ్రాయిడ్ ఓఎస్ ఎంత శాతం...? ఫ్రోయో 2.2 0.1 శాతం జింజిర్ బ్రెడ్ 2.3.3-2.3.7 2.6 శాతం ఐస్ క్రీం శాండ్విచ్ 2.2 జెల్లీబీన్ 21.3 కిట్ క్యాట్ 33.4 లాలీపాప్ 35.8 మార్షమాలో 4.6 శాతం |