• తాజా వార్తలు

వ‌చ్చేసింది ఎల్‌జీ స్టైలెస్‌2..

గృహోప‌క‌ర‌ణాలు త‌యారీలో ఎజీ సంస్థ ఎప్పుడూ ముందంజ‌లో ఉంటుంది. ఐతే ఆ సంస్థ ఫోన్ మార్కెట్లోకి వ‌చ్చినా.. మిగిలిన కంపెనీల మాదిరిగా  విజ‌య‌వంతం కాలేదు. ఇటీవ‌లే ఆ సంస్థ మంచి మంచి స్మార్టుఫోన్ల‌ను త‌యారు చేసి మార్కెట్లో వ‌దులుతోంది.  ఈ నేప‌థ్యంలో వ‌చ్చిందే ఎల్‌జీ స్టైలెస్‌2. ఈ ఫోన్ భార‌త సెల్‌ఫోన్ మార్కెట్‌దారుల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది. దీని ఫీచ‌ర్లు కూడా వినియోగ‌దారుల‌ను త్వ‌ర‌గా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. 5.7 హెచ్‌డీ తెర‌తో పాటు, భిన్న‌మైన డిజైన్ల‌లో  ఎల్‌జీ ఈ ఫోన్ల‌ను మార్కెట్లోకి ప్ర‌వేశ‌పెట్టింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగ‌న్ క్వాడ్ కోర్ ప్రొసెస‌ర్‌తో పాటు 1.2 గిగా హెట్జ్ సామ‌ర్థ్యంతో ఈ ఫోన్‌ను రూపొందించారు. 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంట‌ర్న‌న‌ల్ స్టోరేజీ ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త‌లు. ఎస్‌డీ కార్డు సాయంతో ఫోన్ మెమెరీని 2 టెరా బైట్స్ వ‌ర‌కు పెంచుకునే అవ‌కాశం ఉంటుంది.   

13 మెగా పిక్స‌ల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్‌లో ఉన్న ఇత‌ర ఫీచ‌ర్లు. ఆండ్రాయిడ్ మార్ష్‌మ‌ల్లో సాఫ్ట్‌వేర్‌తో దీన్ని రూపొందించారు.  ఈ ఫోన్ 4జీ ఎల్‌టీఈ, వాయిస్ ఓవ‌ర్ ఎల్‌టీఈకి కూడా ప‌ని చేస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉన్న మ‌రో ఫీచ‌ర్ పెన్ పాప‌ప్‌. దీని ద్వారా మ‌నం ఫోన్‌ను ఆప‌రేట్ చేయ‌చ్చు. దీని వ‌ల్ల స్ర్కీన్ కూడా ఎలాంటి మ‌ర‌క‌లు లేకుండా మృదువుగా ఉంటుంది.  పెన్ కీప‌ర్‌, పెన్ పాప్ లాంటి ఆప్ష‌న్లు దీనికి ఉన్నాయి. దీనిలో ఉన్న కాలిగ్ర‌ఫీ ఫాంట్ ద్వారా ఫౌంటెన్ పెన్ అంత వేగంగా రాసే అవ‌కాశం ఉంటుంది. గోధుమ మ‌రియు టైటాన్ రంగుల్లో ల‌భ్యం అవుతున్న ఈ ఫోన్లు రూ.19500 ధ‌ర‌కు మార్కెట్లో  అందుబాటులో ఉంది.

ఎల్‌జీ స్టైలెస్‌2 మొబైల్స్ ఈ మే 18 నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ మార్కెట్లోకి విడుద‌ల అయ్యాయి. ఆరంభంలో ఆఫ‌ర్లు పెట్టి వినియోగ‌దారులను త‌మ ప్రొడెక్టు వైపు తిప్పుకునేందుకు ఎల్‌జీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.  తాము పెట్టిన డ‌బ్బుల‌కు త‌గ్గ ఫోన్ కావాల‌ని ఆశించే క‌స్ట‌మ‌ర్లు ఎల్‌జీ స్టైలెస్‌2 ఫోన్ స‌రైన ప్ర‌త్యామ్నాయ‌మ‌ని ఆ సంస్థ చెబుతోంది.

 

జన రంజకమైన వార్తలు