• తాజా వార్తలు

ఎల్‌జీ కె సిరీస్... రెడీ టు రిలీజ్

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఉత్పత్తిదారు ఎల్‌జీ తన నూతన స్మార్ట్‌ఫోన్లు 'కె10, కె7'లను ఈ నెల 14న విడుదల చేయనుంది. వీటి ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.  స్మార్టు ఫోన్ల మార్కెట్లో చైనా, దేశీయ కంపెనీలు దూసుకొస్తున్నప్పటికీ నాణ్యత కారణంగా ఇప్పటికీ తన మార్కెట్ ను తాను నిలుపుకోగలుగుతున్న ఎల్ జీ ఇటీవల కాలంలో వేగం పెంచింది. పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ హై ఎండ్ వెర్షన్లతో మార్కెట్లో నిలదొక్కుకోవాలని భావిస్తోంది.

ఎల్‌జీ కే10 ఫీచర్లు...

- స్టోరేజి కెపాసిటీలో తేడాలతో రెండు వర్షన్లుగా వస్తోంది.

- ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్  ఆపరేటింగ్ సిస్టం

- 5.3 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

- 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్

- 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

- 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

- 2300 ఎంఏహెచ్ బ్యాటరీ

- 8/16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

ఎల్‌జీ కె7 ఫీచర్లు...

- ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్

- 5 ఇంచ్ డిస్‌ప్లే, 854 X 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

- 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్

- 8/16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

- 2125 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ/3జీ

- 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

- 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

హ్యువాయ్ స్మార్టువాచ్..

హ్యువాయ్ సంస్థ  తన నూతన ఆండ్రాయిడ్ వేర్ స్మార్టువాచ్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.22,999 ధరకు ఈ వాచ్ ఫ్లిప్‌కార్టు సైట్ ద్వారా వినియోగదారులకు లభిస్తోంది.  ఆడవాళ్లయిన,మగవాళ్లయినా ధరించేందుకు వీలుగా దీన్ని వివిధ రకాల రంగులు, స్టైల్సులో రూపొందించారు. ఈ వాచ్ 1.4 ఇంచ్ అమోలెడ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 400 X 400 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 512 ఎంబీ ర్యామ్, 300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ వాచ్‌ను ఫుల్ చార్జ్ చేసేందుకు 75 నిమిషాల సమయం పడుతుంది. ఇందులో బిల్టిన్ మైక్రోఫోన్‌ను కూడా అందిస్తున్నారు.

 

జన రంజకమైన వార్తలు