• తాజా వార్తలు

డిటాచబుల్ కీ బోర్డు తో లెనోవా Miix 510

డిటాచబుల్ కీ బోర్డు తో లెనోవా Miix 510

లెనోవా  తన హైబ్రిడ్ లాప్ టాప్ ల విభాగo లో వేసిన మరొక ముందడుగు Miix510. రెండు రోజుల క్రితం లాంచ్ అయినట్లు  ప్రకటించిన ఈ లాప్ టాప్ యొక్క ప్రత్యేకత డిటాచబుల్ కీ బోర్డు.  తక్కువ బరువు మరియు ట్యాబు లాగా కూడా ఉపయోగపడే డివైస్ లని ఇష్టపడేవారికోసమే దీనిని తయారు చేసినట్లు లెనోవా చెబుతుంది.

ఇది 12.2 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే తో లభిస్తుంది. దీని రిసల్యూషన్ 1920x1200 పిక్సెల్ లు ఉంటుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో దీని డిస్ ప్లే లభిస్తుంది. దీనిలో 8 GB వరకూ ఉండే RAM తో పాటు ఇంటెల్ జనరేషన్ 6 కోర్ i 7 ప్రాసెసర్ ఉంటుంది. దీని ఎక్స్టర్నల్  స్టోరేజ్ సామర్థ్యం మైక్రో SD ద్వారా 1 TB ఉంటుంది. మెషిన్ ను డిజైనింగ్ స్టఫ్ గా ఉపయోగించే వారూ మరియు తరచుగా నోట్స్ రాసుకునే వారికోసం లెనోవా ఆక్టివ్ పెన్ కూడా ఇవ్వబడింది. అంతేగాక దీనిలో ఒక బ్యాక్ లిట్ కీ బోర్డు కూడా ఉంటుంది.

డిజైన్ పరంగా చుస్తే ఇది ఎంతో ఆకర్షణీయం గా ఉంటుంది. డివైస్ ను ఫ్రీ గా నిలబెట్టేందుకు వీలుగా కిక్ స్టాండ్ కూడా లభిస్తుంది. డిస్ ప్లే దగ్గర దీని మందం 9.9 mm ఉంటుంది అదే కీ బోర్డు దగ్గర దీని మందం 15.9 mm ఉంటుంది. కీ బోర్డు లేకుండా దీని బరువు 880 గ్రాములు ఉండగా కీ బోర్డు తో కలిపి 1.25 kg ఉంటుంది. ఇది ప్లాటినం, సిల్వర్, నలుపు రంగులలో లభిస్తుంది.

ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఇది మంచి కనెక్టివిటీ ఫీచర్ లను కలిగి ఉంటుంది. వైఫై బ్లూ టూత్ లాంటి సాధారణ కనెక్టివిటీ ఫీచర్ లతో పాటు LTE కూడా ఉంటుంది. ఒక వేళ వైఫై అందుబాటులో లేకపోతే ఈ LTE ఉపయోగపడుతుంది.

 

జన రంజకమైన వార్తలు