మార్కెట్ అవసరాలకు తగ్గట్టు, వినియోగదారుల జీవన శైలికి సరిపోయోటట్టు ఫోన్లను తయారు చేసి వదలడంలో చైనా మల్టీ నేషనల్ కంపెనీ లెనొవో ముందంజలో ఉంటుంది. గతంలో ఎన్నో మోడల్స్‌ను తయారు చేసి యూజర్లను విశేషంగా ఆకట్టుకున్న లెనొవో కంపెనీ మార్కెట్లోకి మరో ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు జుక్ జెడ్1. ఇటీవల గూగుల్ మోటో సిరీస్ కొత్త మోడల్స్ మార్కెట్లోకి వచ్చి అందరిని ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఆ ఫోన్లకు పోటీగా లెనొవో ఈ కొత్త మోడల్‌ను బరిలో దింపింది. ప్రస్తుతానికి ఆన్‌లైన్‌లో మాత్రమే లభ్యం అవుతున్న ఈ ఫోన్‌ను మోటో 4 ఎస్‌తో పాఉట జియోమి, లీ ఎకో, ఒన్ ప్లస్‌లకు సవాల్ విసిరే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న స్మార్టుఫోన్లకు సవాల్ విసిరే స్పెసిఫికేషన్స్‌తో రూపొందించిన ఈ ఫోన్ వినియోగదారులను బాగా ఆకట్టకుంటుందని లొనొవో భావిస్తోంది. చూడగానే ఆకట్టుకునేలా, నాజుగ్గా జుక్ జెడ్ 1 ఫోన్‌ను రూపొందించారు. 5.5 అంగుళాల స్క్రీన్‌తో పాటు ఇది లైట్ వెయిట్‌గా ఈ ఫోన్ ఎంతో హ్యాండీగా ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ ప్యానల్‌కు అతికినట్లుగా ఉంచిన ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఈ ఫోన్‌కు కొత్త అందాన్ని తీసుకొచ్చింది. దీని వెనుక భాగంగా వంపు తిరిగి ఉండటంతో గ్రిప్ కూడా బాగుంటుంది. ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లేతో సినిమాలు, వీడియోలు బ్రహ్మాండంగా చూడొచ్చు. దీనికి ఉన్న రిఫ్లక్టివ్ డిస్ ప్లే వల్ల సూర్యకాంతి నేరుగా పడుతున్నప్పుడు కూడా ఫొటోలను ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. క్వాడ్ కోర్ 2.5 గిగా హెట్జ్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 801 ప్రొసెసర్‌తో ఈ ఫోన్‌ను తయారు చేశారు. 3 జీబీ ర్యామ్‌తో పాటు 64 జీబీ ఇంటర్నల్ మెమెరీ ఈ ఫోన్ ప్రత్యేకత. 4 జీని సపోర్టు చేసే డ్యుయల్ సిమ్ ఆప్షన్ ఉంది. ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ రూ.13,499 కే లభ్యం కావడం మరో విశేషం. 64 ఇంటర్నల్ మెమెరీతో వచ్చిన స్మార్టుఫోన్లలో అత్యంత చౌకైన ఫోన్ ఇదే. |