అందరికి నచ్చే, అందరూ మెచ్చే ఫోన్లను తయారు చేయడంలో చైనా మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ లెనొవొ ముందంజలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ ఇటీవల కాలంలో ఎన్నో ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది. ఇవి వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భారత్‌లో శాంసంగ్, మోటో కంపెనీలకు లెనొవొ మంచి పోటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే లొనొవొ ఇటీవల రంగంలోకి తీసుకొచ్చిన జుక్ జెడ్1 గొప్ప ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తోంది. ఇటీవల విడుదలైన ఫోన్‌లో వినియోగదారులకు ఉపయోగపడే ఫీచర్లు బాగానే ఉన్నాయి. 5.5 అంగుళాల స్క్రీన్‌తో ఇది చూడటంతోనే ఆకట్టుకుంటుంది. 5.5 అంగుళాల స్క్రీన్‌తో మార్కెట్లో ఎన్నో ఫోన్లు అందుబాటులో ఉన్నా.. ఈ స్క్రీన్ చుట్టూ ఉన్న మందమైన బీజెల్స్ వల్ల జుక్ జెడ్1 మరింత పెద్దదిగా కనిపిస్తుంది. 4100 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ మరో ప్రత్యేకత. దీని వల్ల ఎంతసేపు ఉపయోగించినా ఛార్జింగ్‌తో ఎలాంటి సమస్య ఉండదు. 1080పీ రిజల్యూషన్‌తో వీడియోలు, ఫొటోలు ఎంతో క్లారిటీగా వస్తాయి. మైక్రోమాక్స్ కెన్వాస్, యురెకా, రెడ్‌మి లా అల్యూమినియం మెటల్ బాడీ ప్రేమ్ లేకపోయినా లెనొవొ జుక్ జెడ్ 1 స్టయిల్‌కు కొరతేం లేదు. దీనికి ఉన్న స్లీక్ మెటల్ ఫ్రేమ్ చూడగానే వినియోగదారులను ఆకర్షిస్తుంది. కెమెరా చుట్టూ ఉన్న చిన్న మెటల్ రింగ్ ఈ ఫోన్ అందన్నా పెంచింది. చూడటానికి యూనికార్న్ మొబైల్ మాదిరిగానే అనిపించినా.. దీని ఈ ఫోన్ ఫీచర్లు మిగిలిన ఫోన్లతో పోలిస్తే ఎంతో భిన్నంగా ఉంటాయి. యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ మిగిలిన మొబైల్స్ కన్నా భిన్నంగా తయారైంది. దీనిలో ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందనే భయం కూడా అక్కర్లేదు. జుక్ జెడ్ 1 ఫోన్ సైనోజెన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో తయారు చేశారు. ఆండ్రాయిడ్ లాలిపాప్ వెర్షన్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. ఐతే లాలిపాప్‌ను మించిన కొత్త వెర్షన్లు అందుబాటులో ఉన్నా... అదే వెర్షన్‌తో జుక్ జెడ్ 1 ను తయారు చేయడం ఒక్కటే నిరాశ కలిగించే విషయం. ప్రస్తుతానికి గోల్డ్, సిల్వర్ రంగుల్లో లభ్యం అవుతున్న ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి అన్ని హంగులతో సిద్ధమైంది. |