• తాజా వార్తలు

మీ ఆండ్రాయిడ్ లో స్పేస్ ఖాళీ చేసుకోండి ఇలా - ఒకే ఒక్క ట్యాప్ తో

వాస్తవంగా చూసుకుంటే మోడరన్ స్మార్ట్ ఫోన్ లన్నీ పరిమిత స్థాయిలో స్టోరేజ్ ను కలిగి ఉంటున్నాయి. అదేంటి చాలా ఫోన్ లు 32 GB వరకూ స్టోరేజ్ ను కలిగి ఉంటున్నాయి కదా? అని అనుమానం మీకు కలుగువచ్చు. అయితే ఈ 32 GB స్పేస్ నిండాలి అంటే ఎక్కువ సమయం ఏమీ పట్టడం లేదు. మనకు తెలియకుండానే ఈ స్పేస్ అంతా పూర్తి అయిపోతుంది. ఎందుకంటే నేడు ప్లే స్టోర్ లో అనేక రకాల యాప్ లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు ప్రతీ యాప్ మనకు ఎదో ఒక రకంగా ఉపయోగపడేదే లేక కనీసం ఆకర్షించేదే అయి ఉంటుంది. ఈ పరిస్థితులలో మెమరీ గురించి పట్టించుకోకుండా అన్ని యాప్ లను మన ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటున్నాము. అది మాత్రమే కాదు కానీ నేడు లభిస్తున్న అన్ని స్మార్ట్ ఫోన్ లు హై ఎండ్ కెమెరా క్వాలిటీ ని కలిగి ఉంటున్నాయి. కాబట్టి వీటితో తీసే ఇమేజ్ లు కానీ, వీడియో లు కానీ ఎక్కువ మెమరీ ని వినియోగించుకుంటున్నాయి. కాబట్టి 32 GB స్పేస్ కూడా సరిపోవడం లేదు ఇక అంతకంటే తక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు.

మరి ఎలా? తొందరగా అయిపోతున్న మన ఫోన్ లోని మెమరీ స్పేస్ ను కాపాడుకునేదేలా? దీనికి పరిష్కారం ఏమిటి? అనుకుంటున్నారా? గూగుల్ ఫోటోస్ ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారం కాగలదు. ఇది మీ ఫోటో లను, వీడియో లను గూగుల్ సర్వర్ లో ఆటోమాటిక్ గా బ్యాక్ అప్ తీస్తుంది. గూగుల్ మొదటగా ఇమేజ్ ల సైజు ను తగ్గిస్తుంది కానీ క్వాలిటీ అనేది ఏ మాత్రం తగ్గకుండా చూస్తుంది. అదే గూగుల్  పిక్సెల్ లో అయితే ఉచిత అన్ లిమిటెడ్ స్టోరేజ్ ఫోటో ల యొక్క ఒరిజినల్ రిసోల్యూషన్ లోనే లభిస్తుంది.

మీరు తీసిన ఫోటో లు ఆటోమాటిక్ గా బ్యాక్ అప్ అవుతున్నాయి కాబట్టి వీటిని మీ ఫోన్ లో స్టోర్ చేసుకోవడం అనే అంశమే ఉండదు.అంతేకాదు గూగుల్ లో ఈ ఫోటో లను చూసేటపుడు అవి ఏ పరికరం నుండి తీసినవో కూడా ఇది చూపిస్తుంది. అంటే మీ ఫోన్ లోని స్పేస్ ను ఉపయోగించకుండా అనేక ఫోటో లను మీరు తీయవచ్చు.

గూగుల్ ఫోటో ల ద్వారా బ్యాక్ అప్ తీయబడిన మీ ఫోటో లను, వీడియో లను కేవలం ఒక్క క్లిక్ తో డిలీట్ చేయవచ్చు. ఫోటోస్ యాప్ లోనికి వెళ్లి ఎడమవైపు స్లయిడ్ ద్వారా ఓపెన్ చేయాలి. ఈ మెనూ లో కొంచెం క్రిందకు వెళితే “ free up space “ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిని చుసిన వెంటనే మీకు ఏం చేయాలో తెలిసిపోతుంది.

ఈ ఆప్షన్ పై మీరు ట్యాప్ చేసిన వెంటనే బ్యాక్ అప్ అయిన ఫైల్ లన్నింటినీ ఇది సెర్చ్ చేస్తుంది. ఇది మీ ఫోన్ యొక్క స్పీడ్ ను అనుసరించి కొన్ని నిమిషాలు లేదా సెకన్లు పట్టవచ్చు. వేచి చూడండి.

ఇలా ఇది ప్రతీ ఫైల్ ను కనుగొన్న తర్వాత వాటిని రిమూవ్ చేయడానికి అనేక రకాల ఆప్షన్ లను ఇది మీకు చూపిస్తుంది.మీరు డిలీట్ ఆప్షన్ ఎంచుకున్న వెంటనే కేవలం సెకన్ల వ్యవధిలోనే మీ ఫైల్ లన్నింటినీ డిలీట్ చేస్తుంది. రిమూవ్ బటన్ ట్యాప్ చేసిన వెంటనే డిలీట్ అవుతున్న ఫైల్ లను చూపించే స్టేటస్ బార్ ను ఇది చూపిస్తుంది. పూర్తీ అయిన వెంటనే ఒక నోటిఫికేషన్ ను చూపిస్తుంది. ఇంకా ఎంత మెమరీ మిగిలి ఉంది కూడా చూపిస్తుంది.

మరెందుకు ఆలస్యo వెంటనే మీ ఫోన్ లో గూగుల్ ఫోటో యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని మీ ఆండ్రాయిడ్ ఫోన్ ను వీలైనంత ఖాళీగా ఉంచుకోండి. 

"

జన రంజకమైన వార్తలు