• తాజా వార్తలు

యాడ్స్ వినండి, ఉచిత కాల్స్ చేసుకోండి లాండ్ లైన్ కి కూడా - నను - యాప్ ద్వారా...

యాడ్స్ వినండి,ఉచిత కాల్స్ చేసుకోండి
లాండ్ లైన్ కి కూడా "నను" యాప్ ద్వారా

గత నెలలో మన కంప్యూటర్ విజ్ఞానం వెబ్ సైట్ లో నాను యాప్ గురించి రాయడం జరిగింది. మా వెబ్ సైట్ లో అత్యంత పాఠకాదరణ పొందిన ఆర్టికల్ లలో ఇది ఒకటి. చాలా మంది పాఠకులు మాకు ఫోన్ చేసి, ఈ మెయిల్ చేసి ఈ యాప్ గురించి పదేపదే అడగడం మమ్మల్ని ఆనందానికి గురి చేసింది. ఆ ఆర్టికల్ లో మేము కేవలం ఆ యాప్ గురించే రాశాము, కానీ పాఠకాదరణ ను దృష్టిలో ఉంచుకొని నాను యాప్ గురించి ఒక సమగ్రమైన సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాము.

ఇంటర్ నెట్ ద్వారా కాలింగ్ చేసుకునే యాప్ లకు నేడు కొదువ లేదు. కాకపోతే వాటన్నింటికీ ఒక చిన్న సమస్య ఉన్నది. ఫోన్ లో మాట్లాడుకునే ఇద్దరు వినియోగదారులు సదరు యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది మొత్తం లో కాల్ రేట్ లు ఉండే యాప్ లు కూడా నేడు చాలా ఉన్నాయి కాకపోతే వాటికీ కూడా వాటి సమస్యలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో ఇంటర్ నెట్ ద్వారా కాలింగ్ చేయడానికి సులభమైన మార్గం ఏదీ లేదా అని వినియోగాదారులు ఆలోచిస్తున్న తరుణం లో వారి ఆశలు తీర్చదానికా అన్నట్లు వచ్చిందే నాను యాప్.

ఈ యాప్ తక్కువ బ్యాండ్ విడ్త్ ఉండడమే గాక అన్ని వాయిస్ కాల్ లను పూర్తి ఉచితంగా అందిస్తుంది. ఇది పనిచేసే విధానం చాలా సులువుగా ఉంటుంది. నాను ప్రతి రోజూ మీకు కొన్ని ఉచిత క్రెడిట్ లను ఇస్తుంది. ఫోన్ కాల్ లు చేయడానికి మీరు ఈ ఉచిత క్రెడిట్ లను ఉపయోగించుకోవచ్చు. మీకు ఇచ్చే క్రెడిట్ లు ఏమంత ఎక్కువగా ఉండవు కానీ మిగతా యాప్ లను డౌన్ లోడింగ్ చేయడం లాంటివి చేయడం ద్వారా మీరు మరిన్ని క్రెడిట్ లను సంపాదించుకోవచ్చు. కాకపోతే ఇది నాను ద్వారా మాత్రమే చేయాలి.

నాను యాప్ చాలా సౌకర్యం మాత్రమే గాక అత్యంత నాణ్యమైన కాల్ లను అందిస్తుంది. ఈ యాప్ ను ఉపయోగించి సెల్ ఫోన్ కే కాక ల్యాండ్ లైన్ నెంబర్ లకు కూడా ఫోన్ చేయవచ్చు. ఏ రోజు క్రెడిట్ లను ఆ ఆరోజు మాత్రమే ఉపయోగించుకోవాలి.

ఈ యాప్ యొక్క ఇంటర్ పేస్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ యాప్ ను మీరు లాంచ్ చేసినపుడు మీకు రీసెంట్ కాల్స్ కనిపిస్తాయి. మీరు నాను డయలర్ ను ఓపెన్ చేసి కాల్స్ చేసుకోవచ్చు. క్రెడిట్ బాలన్స్ మరియు మీరు ఎన్ని నిమిషాలు అలా మాట్లాడవచ్చు తదితర విషయాలన్నీ డయలర్ లోనే కనిపిస్తాయి. మెనూ లో మీకు లభించే ఫ్రీ క్రెడిట్స్ కనిపిస్తాయి. మీకు మరిన్ని క్రెడిట్స్ కావలంటే మీరు ఫ్రీ క్రెడిట్స్ మెనూ కి వెళ్ళవచ్చు. ఉదాహరణకు అమజాన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే మీకు 5 ఉచిత క్రెడిట్ లు లభిస్తాయి. ఏదైనా వెబ్ గేమ్ ఆడితే అది 49 ఉచిత క్రెడిట్ లకు సమానం. 2 జి, 3 జి, 4 జి మరియు ల్యాండ్ లైన్ ఇలా ఏ కనెక్టివిటీ కైనా సరే దీని నుండి వెళ్ళే కాల్స్ చాల స్పష్టంగా నాణ్యం గా ఉంటాయి. ఈ మేరకు మేము దీనిని పరీక్షించడం కూడా జరిగింది. స్కైప్, వైబార్ లాంటి వాటితో పోలిస్తే 80 శాతం తక్కువ డేటా దీనికి అవసరం అవుతుంది. ఎవరికైనా దీనినుండి కాల్ చేసినపుడు నిమిషానికి 105KB డేటా ఖర్చు అవుతుంది. అంతేగాక ఎవరికైనా కాల్ చేసినపుడు ఒక యాడ్ కూడా మీకు వినిపిస్తుంది. ఇండియా లో అయితే నిమిషానికి 2 క్రెడిట్ లు ఖర్చు అవుతాయి. మిగతా రేట్ ల కోసం ఈ యాప్ ను వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఆండ్రాయిడ్ మరియు iOS లలోనూ లభిస్తుంది.

మరెందుకు ఆలస్యం వెంటనే నాను యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. ఉచిత కాల్ లను ఎంజాయ్ చేయండి.

 

జన రంజకమైన వార్తలు