• తాజా వార్తలు

స్మార్ట్ ఫోన్ లలో కొత్త ట్రెండ్ లాకర్ యాప్స్. 91 లాకర్ యాప్ రివ్యూ

ప్రస్తుత పరిస్థితుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి ఉందనేది అందరూ ఒప్పుకోవలసిన విషయం. మన సమాచారం మరియు మనకు యొక్క అతి ముఖ్యమైన విషయాలు, ఫోటోలు, వీడియో లు లాంటిఫైల్ లు అన్నీ దాదాపుగా మన స్మార్ట్ ఫోన్ లోనే భద్ర పరుస్తూ ఉంటాము. ఈ స్మార్ట్ ఫోన్ లకు వివిధ రకాల లాక్ లను మనం ఇస్తూ ఉంటాము. టెక్నాలజీ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త లాక్ లను అందిస్తూ ఉంటుంది. మామూలు లాక్ ల దగ్గర నుండీ స్లయిడ్ లాక్, పిన్, పాటర్న్ ఇలా మొదలై ప్రస్తుతం ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ స్కానర్ ల వరకూ వీటి విస్తృతి కొనసాగుతూనే ఉంది. ఇన్ని రకాల లాక్ ల ద్వారా మనం ఫోన్ లు వివిధ రకాలుగా లాక్ చేయబడుతున్నాయి. ఇవన్నీ కూడా మన డేటా ను అత్యంత సురక్షం గా ఉంచుతూ మనకు తప్ప మరెవరినీ యాక్సెస్ చేయకుండా కాపాడతాయి. ఆ విస్తృతిని కొనసాగిస్తూ మీరు ఫోన్ లాక్ చేసే విధానాన్ని స్టైలిష్ గా మార్చివేయడానికి వచ్చింది 91 లాకర్స్ యాప్ .

ఛార్జింగ్ నోటిఫికేషన్ ల దగ్గరనుండీ లాక్ స్క్రీన్ వాల్ పేపర్ ల వరకూ మనకు కావలసిన విధంగా మార్చుకునే ఆప్షన్ లను ఈ యాప్ అందిస్తుంది. ఈ ఫోన్ యొక్క లాక్ స్క్రీన్ ను ఫన్నీ గా ఉంచేందుకు ఈ యాప్ లో వందల్ కొద్దీ టెంప్లేట్ లు ఉన్నాయి.  ఇది దాదాపు అన్ని ఆండ్రాయిడ్ పరికరాల లో లభిస్తుంది. ఇందులో ఉండే వివిధ రకాల ఫీచర్ ల గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం.

లాక్ స్క్రీన్ టెంప్లేట్ ల కోసం కస్టమైజేషన్ ఆప్షన్ లు

ఇందులో అనేక రకాల టెంప్లేట్ లు ఉంటాయి. ఈ యాప్ లోని టెంప్లేట్ లనుండి ఏదైనా ఒక దానిని సెలెక్ట్ చేసుకుని మీ లాక్ స్క్రీన్ గా సెట్ చేసుకోవచ్చు, లేదా మీ హోం గ్యాలరీ నుండి కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ 91 లాకర్ అనే యాప్ లో ఉండే టెంప్లేట్ లు లేటెస్ట్ , మరియు హాట్ అనే రెండు కేటగరీ లు గా ఉంటాయి. దీనివలన మీకు కావాల్సిన దానిని ఎంచుకునే అవకాశం ఉంటుంది.

వివిధ రకాల లాక్ కోడ్ లు మరియు సులభమైన రీ సెట్ ఆప్షన్ లు

PIN కోడ్ లు, పాస్ వర్డ్ లు, పాటర్న్ లు లాంటి సాధారణ లాకింగ్ ఆప్షన్ ల తో పాటు ఫోన్ ను లాక్ చేయడానికి కొత్త పద్దతులను ఇది కలిగి ఉంటుంది. కస్టమ్ ఫోటో పాస్ కోడ్ అనే ఫీచర్ ను ఇది కలిగి ఉంటుంది. ఇది PIN కోడ్ లాగే పనిచేస్తుంది. కాకపోతే PIN కోడ్ లో మనం నంబర్ లను ఉపయోగిస్తాము ఇందులో వాటికి బదులు ఇమేజ్ లను ఉపయోగిస్తాము. మీరు లాక్ స్క్రీన్ యానిమేషన్ ను కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది ఫింగర్ ప్రింట్ అన్ లాకింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.

ఒకవేళ మేరు మీ పాస్ కోడ్ ను  మర్చిపోయినట్లయితే అత్యంత సులభంగా రీ సెట్ చేసుకునే వీలును కూడా కల్పిస్తుంది. దీనిని ఉపయోగించుకోవాలి అంటే రీ సెట్ బటన్ పై టాప్ చేస్తే ఒక ఆటోమేటేడ్ రీ సెట్ పాస్ వర్డ్ ను ఇది మీ రిజిస్టర్డ్ ఈ మెయిల్ కు పంపిస్తుంది. వేరే డివైస్ నుండి మీరు ఈ మెయిల్ ను ఓపెన్ చేసి ఆ పాస్ వర్డ్ ద్వారా మీ ఫోన్ కు తిరిగి యాక్సెస్ ను పొందవచ్చు, ఇది తాత్కాలిక పాస్ వర్డ్ కాబట్టి దీనిని ఉపయోగించి మళ్ళీ వేరొక పాస్ వర్డ్ ను మీరు సెట్ చేసుకోవలసి ఉంటుంది.

ప్రొడక్టివిటీ ఫీచర్ లు

ఈ యాప్ తన లాక్ స్క్రీన్ పై ప్రొడక్టివిటీ ఆప్షన్ లను కూడా అందిస్తుంది.స్క్రీన్ పై ఇవ్వబడిన బ్రీఫ్ కేస్ ఆప్షన్ లో ఫ్లాష్ లైట్, క్యాలిక్యులేటర్, కెమెరా, సెట్టింగ్స్, వైఫై, మొబైల్ డేటా, ఇలా చాలా వాటికి షార్ట్ కట్ లు ఉంటాయి.కాకపోతే మొబైల్ డేటా ఆప్షన్ డైరెక్ట్ గా ఉండదు.

ఇందులో RAM క్లీనర్ అనే ఫీచర్ కూడా ఉంటుంది. ఇది అనవసరమైన బ్యాక్ గ్రౌండ్ యాప్ లను క్లోజ్ చేయడం ద్వారా RAM పై అదనపు ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనిలో డ్రాయర్ అనే విభాగం లో ఉండే రాకెట్ అనే ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చు.

వినియోగదారుడు లాక్ స్క్రీన్ పై స్లయిడ్ చేసినపుడు ఇది డ్రాయర్ ను ఓపెన్ చేస్తుంది. ఇందులో తరచుగా ఉపయోగించిన యాప్ లు అయిన ఫేస్ బుక్, యాహు, యు ట్యూబ్ లాంటివి ఉంటాయి. ఇందులో సెర్చ్ ఇంజిన్ లా ఉపయోగపడే అడ్రెస్ బార్ కూడా ఉంటుంది. ఇందులో ఉండే ఫీచర్ లన్నీ చాలా బాగుంటాయి.

సరిగా హేండిల్ చేయబడిన నోటిఫికేషన్ లు

ఈ 91 లాకర్స్ యాప్ నోటిఫికేషన్ లపై ప్రత్యేక శ్రద్ద ను తీసుకుంటుంది. ఈ మెయిల్ , వాట్స్ అప్, ఫేస్ బుక్ లాంటి వాటికి సంబందించిన నోటిఫికేషన్ లు కనిపించే స్టైల్ ను మీరు మీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. అంతేగాక ఆ నోటిఫికేషన్ లను కనపడకుండా కూడా చేయవచ్చు. మీకు నోటిఫికేషన్ వచ్చినట్లు మాత్రమే తెలియాలి అందులో అనుకుంటే కూడా ఇందులో ఆప్షన్ ఉంటుంది. ఉదాహరణకు మీకు వాట్స్ అప్ లో ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, మీకు వాట్స్ అప్ నుండి మెసేజ్ వచ్చినట్లు చూపిస్తుంది అంతే అది తప్ప మరే ఇతర సమాచారం ఆ నోటిఫికేషన్ లో కనపడదు.

జన రంజకమైన వార్తలు