స్మార్టు ఫోన్లతో ఇండియన్ మార్కెట్ ను షేక్ చేస్తున్న రెడ్ మీ తాజాగా వైఫై రూటర్ ఒకటి చైనాలో రిలీజ్ చేసింది. 'ఎంఐ రూటర్ 3జీ' పేరిట విడుదల చేసిన ఇది గత ఎంఐ రూటర్ 3 కంటే కొన్ని అదనపు ఫీచర్లతో ఉంది. చైనాలో దీని ధర 249 చైనీస్ యువాన్లుగా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.2360 వరకు ఉండొచ్చు.
డ్యూయల్ గిగాబైట్ బ్యాండ్ టెక్నాలజీ
డ్యుయల్ గిగాబైట్ బ్యాండ్ టెక్నాలజీ దీని ప్రత్యేకత. దీనివల్ల సిగ్నల్ రేంజి, క్లారిటీ పెరుగుతుంది. రూటర్ వేగంగా పనిచేసేలా ప్రత్యేకమైన డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబీ ర్యామ్‌లను ఇందులో ఏర్పాటు చేశారు. దీని వల్ల గరిష్టంగా 1167 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రూటర్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. 128 డివైస్‌లకు దీన్ని ఒకేసారి కనెక్ట్ చేయొచ్చు.
ఇంటర్నల్ సైబర్ సెక్యూరిటీ
ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై లభిస్తున్న ఎంఐ వైఫై యాప్‌ను వేసుకుంటే రూటర్‌ను ఫోన్ ద్వారానే యాక్సెస్ చేయవచ్చు. పీసీతో ఆపరేట్ చేయాల్సిన అవసరమే ఉండదు. మెరుగైన ఇంటర్నెట్ సెక్యూరిటీ ఫీచర్లతో వస్తున్నందన డివైస్ తో పాటు డాటా కూ సైబర్ థ్రెట్ల నుంచి రక్షణ ఉంటుంది. ఇది ఇండియాలో ఎప్పుడు లాంఛయ్యేది షియోమీ ఇంకా ప్రకటించలేదు.