• తాజా వార్తలు

ఎం ఎస్ ఆఫిస్ కు ఒక సులువైన, ఉచిత ప్రత్యామ్నాయం - డబ్లు. పి ఎస్ ఆఫిస్ 2016

ఎం ఎస్ ఆఫిస్ కు ఒక సులువైన, ఉచిత ప్రత్యామ్నాయం - డబ్లు. పి ఎస్ ఆఫిస్ 2016

ఇన్నాళ్ళూ ఫైల్ సంబందిత రంగాన్ని ఏక చత్ర్రాదిపత్యం గా పాలిస్తున్న మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ కు సరైన ప్రత్యామ్నాయం దొరికిందా? WPS ఆఫీస్ 2016 అనేది MS ఆఫీస్ కు ప్రత్యామ్నాయం కానుందా?

ఫైల్ సంబందిత ఆఫీస్ సూట్ లకు డబ్బు చెల్లించాలని ఎవరూ కోరుకోరు. అసలు ఏ సాఫ్ట్ వేర్ అయినా ఉచితం గానే కావాలని అందరూ అనుకుంటారు. ఇది సహజం. ఈ కారణాల చేత ఈ రంగం లో ఇప్పటివరకూ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ తిరుగులేని ఛాంపియన్ గా నిలిచింది. అయితే దీనికంటే మంచి ఫలితాలను ఇచ్చేవి, మంచి అనుభూతిని ఇచ్చే ఉచిత ప్రత్యామ్నాయాలు ఏవైనా ఉంటే కనీసం డబ్బులు చెల్లించి అయినా ఒక సారి వాటిని చూద్దాం అని అనిపిస్తుంది కదా! ఆ కోవకు చెందినదే WPS ఆఫీస్ 2016. MS ఆఫీస్ కు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ వాటిలో దేనిని ఉత్తమమైనది గా చెప్పుకోవచ్చు. దీనిని రెండు వారాల పాటు మనం ఉపయోగించి ఆ తర్వాత ఇష్టం ఉంటే కొనసాగించవచ్చు. మేము రెండు వారాల పాటు దీనిని ఉపయోగించాము.

మేము రచయితలం కాబట్టి ఈ WPS ఆఫీస్ లో ఉండే వర్డ్ ప్రాసెసర్ ను ఎక్కువగా ఉపయోగించాము. ఈ యాప్ చాలా లైట్ గా ఉండడమే గాక మేము ఉపయోగించిన రెండు వారాలలో ఒక్కసారి కూడా ఫ్రీజ్ కాలేదు. ఈ WPS సూట్ కి ఉండే లైట్ స్వభావం తో పాటు, మంచి డిజైన్ ఉండడం వలన ఇది MS ఆఫీస్ కు మంచి ప్రత్యామ్నాయం కాగలదు అనిపిస్తుంది. ఈ WPS రైటర్ ఎడిటింగ్ టూల్ గానూ పనిచేస్తుంది. కామెంట్స్ మరియు ట్రాక్ చేంజెస్ లాంటి ఫీచర్ లు ఊహించినట్లు గానే ఉన్నాయి. ఇవి MS వర్డ్ తో పోలిస్తే చూడడానికి బాగానే ఉన్నాయి వీటిని వాడేటపుడు ఎటువంటి సమస్యా ఎదురవలేదు. మా రోజువారీ రైటింగ్ కు WPS రైటర్  ను వాడుతున్నపుడు ఏ సమస్యా రాలేదు. బహుశా ఇది 30 రోజుల ఉచిత ట్రయల్ వెర్షన్ లో ఉండడం వలన కావచ్చు. ఈ 30 రోజుల తర్వాత WPS ఆఫీస్ 2016 కి కొన్ని పరిమితులు ఉన్నాయి.

30 రోజుల తర్వాత కూడా మీరు ఉచిత వెర్షన్ ను పొందాలి లేదా దీనిలోని కొన్ని ఫీచర్ లను ఉపయోగించాలి అనుకుంటే 5 సెకన్ల పాటు ఉండే బానర్ యాడ్ ను వీక్షించ వలసి ఉంటుంది. ఈ యాడ్ చుసిన తర్వాత మీకు కావలసిన ఫీచర్ లు ఓపెన్ చేసేందుకు యాక్సెస్ లభిస్తుంది. అదికూడా 30 నిమిషాల వరకే. ఆ తర్వాత కొనసాగించాలంటే మరొక యాడ్ చూడాలి. ఈ విధంగా WPS లో ఉండే ఫీచర్ లకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మీ ట్రయిల్ పీరియడ్ అయిపోయిన తర్వాత వీటిని వాడాలంటే మాత్రం యాడ్ చూడవలసిందే. ఒకవేళ మీకు యాడ్ లు చూడడం ఇష్టం లేకపోతే మీరు కొంత డబ్బు చెల్లించవలసి ఉంటుంది. ఇది కేవలం బానర్ యాడ్ మాత్రమే అది కూడా 5 సెకన్లు మాత్రమే కాబట్టి పెద్దగా విసుగు ఉండకపోవచ్చు. కానీ దీనిని ప్రొఫెషనల్ గా వాడాలని అనుకునే వారికి ఈ యాడ్ లు కొంచెం చికాకు తెప్పించవచ్చు.

ఈ WPS ఆఫీస్ లో ఉండే స్ప్రెడ్ షీట్ లూ, ప్రజెంటేషన్ లూ చాలా బాగున్నాయి. ఎటువంటి సమస్యలూ ఎదురుకాలేదు. సాధారణంగా ఉచిత ఆఫీస్ యాప్ లైన ఓపెన్ ఆఫీస్, లిబరే ఆఫీస్ లాంటి వాటిలో PPT, XLSX లాంటివి  ఉపయోగించేపుడు కొన్ని రెండరింగ్ సమస్యలు ఎదురవడం మేము గమనించాము. కానీ ఈ WPS ఆఫీస్ లో మాత్రం ఎటువంటి సమస్యా ఉత్పన్నం కాలేదు.

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న WPS ఆఫీస్ 2016 MS ఆఫీస్ కు మంచి ప్రత్యామ్నాయం కాగలదు అనిపిస్తుంది.

 

జన రంజకమైన వార్తలు