• తాజా వార్తలు

మార్ష్ మాలో ఓఎస్ తో ఎల్‌జీ 4జీ స్మార్ట్‌ఫోన్లు...

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు ఎల్‌జీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో పోటీని తట్టుకుని నిలబడుతున్నా దూకుడు మాత్రం చూపలేకపోతుంది. ఈ లోటు భర్తీ చేయాలనుకుందో ఏమో కానీ తాజాగా ఒకేసారీ రెండు లేటెస్ట్ ఫోన్లను పరిచయం చేసింది. ఈ ఫోన్లలో ప్రధానంగా కెమేరా, డిస్ ప్లే ప్రత్యేక ఆకర్షణలని కంపెనీవర్గాలు చెబుతున్నాయి. త్వరలో బార్సిలోనాలో జరగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో వీటిని ప్రదర్శించబోతోంది. ఆసియా, ఐరోపా, లాటిన్ అమెరికా మార్కెట్లలో ఈ మోడల్స్ ను వచ్చే నెలాఖరు నుంచి అందుబాటులో ఉంచబోతోంది. ప్రస్తుతానికి వీటి ధర కూడా ఇంకా ప్రకటించలేదు. మార్చి మొదటివారంలో ధర ప్రకటిస్తారని భావిస్తున్నారు. తక్కువ బరువు, అధిక బ్యాటరీ సామర్థ్యం వంటి అదనపు ఆకర్షణలు వీటికి ఉన్నాయి. ఫోన్ల తయారీలో మొదటి నుంచి ఆకర్షణీయమైన డిజైన్తలో ఆకట్టుకునే ఎల్ జీ ఇప్పుడు ఈ ఎక్స్ సిరీస్ లోనూ అదే సూత్రాన్ని ఫాలో అయింది. 'ఎక్స్' సిరీస్‌లో 'ఎక్స్ స్క్రీన్', 'ఎక్స్ క్యామ్‌'ల పేరిట రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడానికి అంతా సిద్ధం చేసుకుంటోంది.

ఎల్‌జీ ఎక్స్ స్క్రీన్ ఫీచర్లు...

- 4.93 ఇంచ్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 

- 1.2 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ 

- 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ 

- 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

- 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 

- ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 4జీ 

ఎల్‌జీ ఎక్స్ క్యామ్ ఫీచర్లు...

- 5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 

- 1.14 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ 

- 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 

- 13,5 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు

- 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 

- ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 4జీ 

- 2520 ఎంఏహెచ్ బ్యాటరీ

 

జన రంజకమైన వార్తలు