• తాజా వార్తలు

మార్కెట్లో క‌ల‌క‌లం రేపుతున్న స‌రికొత్త స్మార్ట్‌టీవీ ఇదే

భార‌త్‌లో ఎప్ప‌టికీ త‌ర‌గ‌ని మార్కెట్ ఉండేది టీవీల‌కే. ఇంట్లో ఎంత ఇంట‌ర్నెట్ ఉన్నా.. టీవీ ప్రొగ్రామ్‌లు చూసిన సంతృప్తే వేరు. అయితే ఒక‌ప్ప‌టిలా సాధార‌ణ టీవీలు కొన‌డానికి వినియోగ‌దారులెవ‌రూ ముందుకు రావ‌ట్లేదు. స్మార్ట్‌టీవీలు అయితేనే కొంటున్నారు.  అయితే ఇప్పుడు స్మార్ట్‌టీవీల్లోనూ బాగా కాంపిటేష‌న్ పెరిగిపోయింది. ప్ర‌స్తుతం అలా మార్కెట్లో ఉన్న స్మార్ట్ టీవీల్లో మ‌రో కొత్త టీవీ వచ్చింది. అదేంటంటే..

థాంప్స‌న్ బ్రాండ్...
ప్ర‌స్తుతం సోని, శాంసంగ్ బాట‌లో చాలా కంపెనీలు స్మార్ట్‌టీవీలు తీసుకొచ్చాయి. ముఖ్యంగా సెల్‌ఫోన్ కంపెనీలు టీవీ మేకింగ్‌పై దృష్టి పెట్టాయి. జియోమి లాంటి కంపెనీలు సైతం స్మార్ట్‌టీవీ మార్కెట్ వైపు చూస్తున్నాయి. యూరోప్‌లో పెద్ద మార్కెట్ ఉన్న థాంప్స‌న్ కంపెనీ కూడా ఇప్పుడు భార‌త్ మార్కెట్‌పై క‌న్నేసింది. దీనిలో భాగంగానే థాంప్స‌న్ టీవీని అందుబాటులోకి తెచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ప్రొడెక్ట్‌ను పెట్టిన కొన్ని నిమిషాల‌కే అన్ని ఆర్డ‌ర్‌లు బుక్ అయిపోయాంటేనే ఈ టీవీ కెపాసిటీని అర్ధం చేసుకోవ‌చ్చు. 

43 అంగుళాల స్క్రీన్‌..
థాంప్స‌న్ న్యూ స్మార్ట్ టీవీ 32 అంగుళాల నుంచి మొద‌లై మాగ్జిమ‌మ్ 43 అంగుళాల వ‌ర‌కు స్క్రీన్ సైజుల్లో ల‌భిస్తుంది. దీని 43 అంగుళాల మోడ‌ల్ బాగా అమ్ముడుపోతోంది. యూహెచ్‌డీ 4కే రిజ‌ల్యూష‌న్ దీనికున్న ప్ర‌త్యేక‌త. ప్ర‌స్తుతం మార్కెట్లో దీని ధ‌ర రూ.27,999గా ఉంది. దీనిలో ఆండ్రాయిడ్ వీ4.4.4 వెర్స‌న్ వాడిన‌ట్లు.. ఆప్టోయిడ్ యాప్ స్టోర్‌తో ఇది వ‌స్తున్న‌ట్లు థాంప్స‌న్ చెబుతోంది. సీఏ53 ప్రాసెస‌ర్‌, 1.4 జీహెచ్‌జెడ్తో పాటు మాలి-టీ720 జీపీయూ, 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ దీనిలో ఉంది. 

జన రంజకమైన వార్తలు