8 జీబీ.. 16 జీబీ..32 జీబీ.. ఏ మొబైల్ ప్రకనటన చూసినా.. ప్రధానంగా వినిపించే మాటలివి. ఫోన్ ఇంటర్నల్ మెమోరీ పెరిగే కొద్దీ ఖరీదూ పెరుగుతూ ఉంటుంది. కాకుంటే ఇక్కడే ఉంది. అసలు కిటుకు. మొబైల్ తయారీ సంస్థలు చెబుతున్నట్లు 8 జీబీకి 8 జీబీ, లేదా వారు చెబుతున్న మొత్తం మొమొరీని యూజర్‌కి అందుబాటులో ఉంచడం లేదు. అందులో సంగం అందుబాటులో ఉన్నా గొప్పే. వారు చెబుతున్న మెమొరీలో సగానికిపైగా ఫోన్ ఫర్మ్‌వేర్ యాప్స్ కే సరిపోతుంది. ఎక్స్ పెండబుల్ మొమొరీ ఆప్షన్ ఉంటే సరి లేకుంటే. అంతే సంగతులు. ఈ మధ్య సోనీ సంస్థ ఎం4 ఆక్వా అనే మొబైల్‌ని మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉన్నట్లు ప్రకటించింది. తీరా ఫోన్ కొన్నాక చూస్తే.. అందులో కేవలం 1.26 జీబీనే అందుబాటులో ఉంది. మిగతా మొమొరీ అంతా ఇన్‌బిల్ట్ యాప్స్ ఫర్మ్ వేర్‌కి సరిపోయింది. గట్టగిగా ఓ 15 యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేసేసరికి ఈ మొమొరీ కూడా నిండుకొంది. మొమొరీ ఫుల్ కావడంతో మొరాయింపూ మొదలైంది. అంటూ ఒక యూజర్ ఎక్స్‌పీరియా బ్లాగ్‌లో మొత్తుకున్నాడు. ఆ మధ్య ఇదే సంస్థ తెచ్చిన ఈ సీరీస్ మొబైల్స్ లోనూ అంతే. వారు చెప్పినంత మెమొరీలో సగం కూడా యూజర్‌కి అందుబాటులో ఇవ్వలేకపోయారు. కేవలం సోనీనే కాకుండా ఇతర సంస్థలదీ అదే దారి. కాబట్టి మొబైల్ తయారీ సంస్థలు చెబుతున్న జీబీ మాయలో పడకుండా.. అసలు వాస్తవానికి మనకు అందుబాటులో ఎంత ఉంటుందనే విషయాన్ని గుర్తెరిగి కొనాలి. కెమెరా, ప్రాసెసర్, ర్యాం, బ్యాటరీ సామర్థ్యం తదితరాలను పరిగణనలోకి తీసుకున్నట్లే ఇంటర్నల్ స్టోరేజీనీ గమనించాలి. లేకుంటే జేబుకు బొక్క తప్ప మంచి ఫోన్ కొన్నామన్న సంతృప్తి మిగలదు. ఇక కొన్ని సంస్థలైతే ఎక్స్ పెండబుల్ మొమొరీని కూడా ఇంటర్నల్ మొమొరీతో కలిపేసుకొని చాలా ఎక్కువ మొమొరీ ఉన్నట్లు చూపిస్తుంటాయి. వాటినీ గుడ్డిగా నమ్మామా.. అంతే సంగతులు. |