ఒకప్పుడు మెసేజ్, చాట్ చేయాలంటే యాహూ ఎంతో ఉపయోగపడేది. ఆ తర్వాత ఈ ఆప్షన్లతో చాలా సర్వీసులు వచ్చాయి. ఐతే అన్ని ఒకే ఫ్లాట్‌ఫామ్ ఉపయోగించుకునే అవకాశం ఉండేది కాదు. ఐతే స్మార్టుఫోన్ విప్లవం వచ్చిన తర్వాత మెసేజింగ్ సర్వీసులన్నీ ఒకే తాటి మీదకు వచ్చేశాయి. మనకు నచ్చిన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని వాటిని ఉపయోగించుకునే అవకాశం వచ్చింది. అయితే మెసెంజర్ యాప్‌లన్నీ ఒకే యాప్‌లో ఉంటే.. సూపర్ కదా! ఇప్పుడు అదే లక్ష్యంతో తయారైంది ఫ్రాంజ్ యాప్. ఈ యాప్‌లో ప్రముఖ మెసెంజర్, చాట్ యాప్‌లు ఫేస్‌బుక్, వాట్సప్, గూగుల్ హ్యాంగ్ఔట్ తదితర సర్వీసులన్నీ ఈ ఫ్రాంజ్ యాప్‌లో ఉంటాయి. అంటే ఈ ఒక్క యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు ఈ మెసెంజర్ సర్వీసులన్నిటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ మార్చిలో విడుదలై ఫ్రాంజ్ యాప్ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సమయంతో పాటు డేటా కూడా కలిసొస్తుండటంతో ఎక్కువమంది గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 35,000 మంది యూజర్లు ఫ్రాంజ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. త్వరలోనే ఈ యాప్ విండోస్, లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఈ యాప్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు దీని రూపకర్తలు తెలిపారు. ఈ మెసెంజర్ యాప్ ప్రస్తుతానికి 14 మెసెజింగ్ సర్వీసులను అందిస్తోంది. వాటిలో ఫేస్‌బుక్, వాట్సప్, హ్యాంగ్ఔట్, స్కైప్ లాంటి ప్రధాన సర్వీసులు ఉన్నాయి. ఈ యాప్ తీసుకునే మెమెరీ చాలా తక్కువ. దీన్ని క్లిక్ చేయగానే మనకు అవసరమైన మెసేజింగ్ సర్వీసులను అది ఒక జాబితాగా చూపిస్తుంది. ఆ జాబితాలో నుంచి మనకు అవసరమైన మెసేజింగ్ సర్వీసులను మనం ఉపయోగించుకోవచ్చు. ఫ్రాంజ్ యాప్‌తో ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ మెసేజింగ్ సర్వీసులను పొందొచ్చు. ఒక మెసేజింగ్ యాప్ అప్‌డేట్ అయితే మనకు వెంటనే అలర్ట్ వస్తుంది. ఏ మెసేజింగ్ సర్వీసులో ఎన్ని మెసేజ్‌లు వచ్చాయోకూడా ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఐతే ఫ్రాంజ్ యాప్‌తో మినమైజ్, మాక్సమైజ్ ఆప్షన్లతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంతేకాక స్లాక్ యాప్ యూజర్లకు నోటిఫికేషన్స్ వస్తున్న సంగతి తెలియకపోవడం కూడా పెద్ద ప్రతికూలత. |