భారత్‌లో ప్రాచుర్యంలో ఉన్న స్మార్టుఫోన్లలో మైక్రోమాక్స్ కూడా ఒకటి. తక్కువ ఖర్చులో స్మార్టుఫోన్లు ఉపయోగించుకోవాలని అనుకునేవాళ్లకు అందుబాటులో ఉన్న బ్రాండ్ మైక్రోమాక్స్. ఐతే మారుతున్న పరిణామాల నేపథ్యంలో కొత్త కొత్త బ్రాండ్‌లను మార్కెట్‌లోకి వదిలి వినియోగదాలను ఆకట్టునే ప్రయత్నం చేస్తోందీ భారత తయారీ సంస్థ. దీనిలో భాగంగానే ఈ ఏడాది మైక్రోమాక్స్ డ్యుయల్ 5 పేరిట కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన మైక్రోమాక్స్ మరో కొత్త ఫోన్‌తో ముందుకొచ్చింది. దాని పేరు మైక్రోమాక్స్ భారత్-2.
మైక్రోమాక్స్ హైఎండ్ ఫోన్లలో ఉండే ఫీచర్లను ఈ మొబైల్‌లోనూ వాడినట్లు మార్కెట్ వర్గాల మాట. 4జీ కనెక్టివీటి, మంచి రిజల్యూషన్ కెమెరాతో పాటు సరిపడినంత స్టోరేజీ ఈ స్మార్టుఫోన్ సొంతం. అన్నిటికంటే విశేషం ఏమిటంటే ఈ ఫోన్ ధర కేవలం రూ.2999 మాత్రమే. 4జీ కనెక్టవిటీ ఉన్న ఫోన్లు ఇంత తక్కువ ధరకు మార్కెట్లో దొరకట్లేదు. ఈ అంశాన్ని సొమ్ము చేసుకోవాలనేదే మైక్రోమాక్స్ వ్యూహం.
మరోవైపు మైక్రోమ్యాక్స్ తన నూతన హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ 'డ్యుయల్ 5' ను కూడా విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు రూ.24,999 ధరకు లభ్యం కానుంది.
మైక్రోమ్యాక్స్ డ్యుయల్ 5 ఫీచర్లు...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి
3200 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0