ఇండియన్ సెల్‌ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ మైక్రో మ్యాక్స్ తన ఫీచర్ ఫోన్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫోన్ కొన్న 100 రోజుల్లోపు హార్డ్‌వేర్‌లో ఏదైనా ప్రాబ్లం వస్తే కొత్త పీస్ రీప్లేస్ చేస్తామని ప్రకటించింది. ఈ 100 రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీ లో సేమ్ మోడల్ ఫోన్‌గానీ అది అందుబాటులో లేకుంటే దానికి సమానమైనది కానీ ఇస్తారు.
10 ఫోన్లకు వర్తింపు
మైక్రోమ్యాక్స్ ప్రకటించిన 100 రోజుల రీప్లేస్‌మెంట్ ఆఫర్ 10 ఫీచర్ ఫోన్లకు వర్తిస్తుంది. ఆ మోడల్స్ ఇవీ..
* మైక్రోమ్యాక్స్ X1i
* మైక్రోమ్యాక్స్ x706
* మైక్రోమ్యాక్స్ x424
* మైక్రోమ్యాక్స్ x740
* మైక్రోమ్యాక్స్ x730
* మైక్రోమ్యాక్స్ x904
* మైక్రోమ్యాక్స్ x570
* మైక్రోమ్యాక్స్ x512
* మైక్రోమ్యాక్స్ x412
* మైక్రోమ్యాక్స్ x726
వారంటీలో ఉంటేనే..
100 రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీ కింద మరో ఫోన్ పొందాలంటే పై మోడల్స్‌లోని ఫోన్ ఏదైనా ఎలిజబుల్. ఆ ఫోన్ వన్ ఇయర్ వారంటీలో ఉండాలి. అంతేకాదు ఫోన్ యాక్టివేషన్ చేసిన 100 రోజుల్లోపే ప్రాబ్లం వస్తేనే ఆఫర్ వర్తిస్తుంది. అది కూడా సాఫ్ట్‌వేర్ ప్రాబ్లం క్లియర్ కాకపోతేనే రీప్లేస్ చేస్తారు. హార్డ్‌వేర్ రిపేర్ అయితే కొత్తదానితో రీప్లేస్ చేస్తారు.