• తాజా వార్తలు

బింగ్ పై నెట్ వర్క్ స్పీడ్ పరీక్షలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్

మీరు మొబైల్ లో గానీ ,కంప్యూటర్ లో గానీ బ్రౌసింగ్ చేసేటపుడు మీ ఇంటర్ నెట్ యొక్క బ్రౌసింగ్ స్పీడ్ తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? కనెక్షన్ దగ్గరకి వెళ్లి సెట్టింగ్ లలో వెతుకుతారు.లేదా స్పీడ్ టెస్టింగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటారు.అంతేకదా!కానీ ఇకనుండీ అంట శ్రమ అవసరం లేదు. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ అయిన బింగ్ లో స్పీడ్ టెస్ట్ అనే ఆప్షన్ ను మైక్రో సాఫ్ట్ ఉంచబోతోంది.మీరు సెర్చ్ అనే దగ్గర స్పీడ్ టెస్ట్ అని టైపు చేసి క్లిక్ చేస్తే చాలు,మీ నెట్ వర్క్ ఎంత బాగా పనిచేస్తుందీ,ఎంత స్పీడ్ గా బ్రౌసింగ్ జరుగుతూ ఉందీ ఇట్టే తెలిసిపోతుంది.కబీర్ చీమా అనే వినియోగదారుడు దీనిని కనిపెట్టాడు.

ఈ ఫీచర్ మొబైల్ మరియు వెబ్ రెండింటిలో పనిచేస్తుంది.మొదట్లో దీనిని వెబ్ కు సంబంధించి క్రోమ్,సఫారీ లలో పరీక్షించారు.కానీ సరైన ఫలితం ఇవ్వలేదు.అంతేకాదు ఈ ఫీచర్ యూసర్ ల యొక్క IP అడ్రస్ ను కూడా చూపిస్తుంది.కానీ ఇది అన్ని వెబ్ బ్రౌజరు లలోనూ,అందరు వినియోగదారులకు అందుబాటులో లేకపోవడం ఒక మైనస్.

మైక్రోసాఫ్ట్ దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.అంటే ఇంకా టెస్టింగ్ దశలోనే ఉందన్నమాట. మైక్రోసాఫ్ట్ యొక్క బింగ్ సెర్చ్ ఇంజిన్ మూవీ టైటిల్స్,పాత యొక్క లిరిక్స్,చిన్న చిన్న కాలిక్యులేషన్ లు లాంటివాటికి సంబంధించి ఒక సమగ్రమైన సమాచారాన్ని బింగ్ అందిస్తుంది.ఈ రకమైన సమాచార సెర్చ్ ఫీచర్ గూగుల్ యొక్క నాలెడ్జ్ గ్రాఫ్ ను పోలి ఉంటుంది. ఇదే సమయంలో నెట్ వర్క్ యొక్క స్పీడ్ ను తెలుసుకునేందుకు గూగుల్ వైపు నుండి ఇంకా ఏమీ కొత్త ఆవిష్కరణ రాలేదు. మరి బింగ్ యొక్క స్పీడ్ టెస్ట్ కు పోటీ గా గూగుల్ కూడా మరేదైనా నూతన ఆవిష్కరణ ను ఈ నెట్ వర్క్ స్పీడ్ టెస్ట్ కోసం తెస్తుందేమో చూడాలి.     

 

జన రంజకమైన వార్తలు