• తాజా వార్తలు

ల్యాండ్లైన్ నెంబర్లపై ఉచిత కాల్స్ అందిస్తున్న నాను యాప్ – నిరాకరిస్తున్న ఆపరేటర్లు

నాను మొబైల్ యాప్ గురించి మీరు వినే ఉంటారు. ఉచిత కాలింగ్ ఆఫర్ లను ఇది అందిస్తుంది. ఈ యాప్ ద్వారా మొబైల్స్ నుంచే గాక ల్యాండ్ లైన్ నెంబర్ ల ద్వారా కూడా ఉచిత కాల్ లను చేసుకోవచ్చు.  అయితే టెలికాం ఆపరేటర్ లు దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు సమాచారం. టెలికాం ఆపరేటర్ లు తమ అభ్యంతరాలను సెక్టార్ రెగ్యులేటర్ మరియు ట్రాయ్ ముందు తమ అభ్యంతరాలను వెలిబుచ్చాయి.అయితే నాను చీఫ్ అయిన మార్టిన్ మాట్లాడుతూ “ భారత టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఇంటర్నెట్ ద్వారా జరిగే సమాచార మార్పిడి అనేది అది ఈ రూపం లో ఉన్నా సరే చట్టబద్దమినదే అంటే అది ఈ మెయిల్ కావచ్చు, వాట్స్ అప్ కావచ్చు లేదా ఫ్రీ కాలింగ్ కావచ్చు.దానికి టెలికాం లైసెన్స్ లతో సంబoదం లేదు” అని అన్నారు.

ప్రపంచం లో ఎక్కడనుండి అయినా సరే, ఈ యాప్ ను ఇన్స్టాల్ చేయకున్నా సరే ఈ యాప్ ద్వారా పరిమిత సంఖ్యలో ఉచిత కాల్ లు చేసుకునే అవకాశాన్ని ఈ నను యాప్ కల్పిస్తుంది. ఈ కాల్ లు మొబైల్ నెంబర్ నుండైనా లేదా ల్యాండ్ లైన్ ద్వారా  అయినా చేసుకోవచ్చు.

అయితే ఈ యావు వలన తమకు నష్టం జరుగుతుందని భావించిన టెలికాం కంపెనీలు ట్రాయ్ మరియు భారత టెలికాం మంత్రిత్వ శాఖ ల పై తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే ట్రాయ్ నిర్ణయం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తునట్లు మార్టిన్ తెలిపారు.ఈ ఉచిత కాల్ ల కోసం సుమారు 2 లక్షల డాలర్ లను టెలికాం కంపెనీలకు నెలనెలా చెల్లిస్తున్నట్లు కూడా కంపెనీ ప్రకటించింది. భారత దేశం లో సుమారు  20 వేల మంది ప్రతి రోజూ నను లో జాయిన్ అవుతున్నారు. 2 మిలియన్ ల వినియోగదారుల నుండి 7 లక్షల కాల్ లు ప్రతి రోజూ నను పొందుతుంది.

 

జన రంజకమైన వార్తలు