మోటోరాలా జీ4 మన మార్కెట్లో.. భారత మార్కెట్లోకి మోటోరోలా సంస్థ తన నూతన స్మార్టు ఫోన్ జీ 4 ను విడుదల చేస్తోంది. 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 5.5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 1.2 జీహెచ్ జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్, ఎన్ఎఫ్ సీ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సల్ వెనుక కెమెరా తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, వాటర్ రెసిస్టెంట్, 4 జీ ఎల్ టీఈ, బ్లూటూత్ 4.2, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి మొదలైన ప్రత్యేకతలతో ఈ స్మార్ట్ ఫోన్ ను రూపొందించారు. 16ఎంపీ సెల్ఫీ కెమేరాతో సోనీ ఫోన్.. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సోనీ, తన మొబైల్ సిరీస్ ఎక్స్‌పీరియా ఎక్స్ సిరీస్‌లో తొలి ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ అల్ట్రా పేరుతో ఉన్న ఫోన్‌ని సంస్థ తన గ్లోబల్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అయితే దాని ధర, ఏయే దేశాల్లో అందుబాటులోకి రానుంది తదితర విషయాల్ని మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఆయా మార్కెట్లలో లాంచ్ అనంతరం ధరలు రీవీల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలస్తోంది. 190 గ్రాముల బరువు తో బ్లాక్, వైట్, గోల్డ్ కలర్స్ ఫోన్ మార్కెట్లో లభ్యంకానుంది. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటో ఫోకస్,హెచ్ డీ ఫోటో ఫీచర్స్ తోఉన్న 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 21.5 మెగాపిక్సెల్ రియర్ కెమేరా ప్రధాన ఆకర్షణ కానుంది. అలాగే 200 జీబీ ఎక్స్ పాండబుల్ మొమరీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఇవీ ప్రత్యేకతలు... * ఆరు అంగుళాల హెచ్‌డీ తాకే తెర * 1080×1920 పిక్సెల్స్ రిజల్యూషన్ * ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టం * 3జీ ర్యామ్ * 16 జీబీ అంతర్గత మెమొరీ * ఎస్డీ కార్డుతో మెమొరీని 200 జీబీ వరకు పెంచుకునే సదుపాయం * 21.5 మెగాపిక్సెల్ రేర్ కెమేరా * ఎల్‌ఈడీ ఫ్లాష్ * 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా * ఫ్రంట్ ఫ్లాష్ * 2700 ఎంఏహెచ్ బ్యాటరీ * తెలుపు, నలుపు, బంగారు రంగుల్లో ఫోన్ లభ్యం * 190 గ్రాముల బరువు |