• తాజా వార్తలు

అవినీతి ప్రభుత్వోద్యోగులను పట్టుకునే సాఫ్ట్ వేర్ రెడీ అవుతోంది

వివిధ ప్రభుత్వ శాఖల్లో పనులు వేగంగా జరిగేలా... పారదర్శకంగా, ఎక్కడా అవినీతికి తావులేకుండా జరిగేలా... ప్రభుత్వోద్యోగుల అవినీతిపై కన్నేసే సాఫ్టువేర్ ను కేంద్రం సిద్ధం చేసింది. ప్రభుత్వ శాఖల్లో పనుల ప్రాసెస్ ను ఆన్ లైన్లో రికార్డు చేసే ఈ సాఫ్ట్ వేర్ క్లౌడ్ బేస్డ్ గా పనిచేస్తుంది.
తొలి దశలో ఈ విధానం పరిధిలోకి కేంద్రంలో పనిచేసే ఐఏఎస్ లు వస్తారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్ లు, ఐపీఎస్ లు దీని పరిధిలోకి వస్తారు. ఆ తరువాత కేంద్రంలో పనిచేసే గ్రూప్ ఏ ఉద్యోగులు... అనంతరం రాష్ర్టాల్లో పనిచేసే ఐఏఎస్ లు అంతా దీని పరిధిలోకి వస్తారు.
ఈ టెక్నాలజీలో వేర్వేరు మాడ్యూళ్లలో ఉద్యోగులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు. విచారణ అధికారులు అంతా వస్తారు. ఇందులో ఏ పని ఎంత కాలంలో పూర్తి చేయాలి... ఆ సమయంలోగా పూర్తి చేస్తున్నారా.. చేయకపోతే ఎందుకు చేయలేదు... ఎక్కడ ఆగింది.. కారణమేంటి వంటివన్నీ రియల్ టైంలో మోనిటర్ అవుతాయి.

జన రంజకమైన వార్తలు