స్కైప్ గురించి మీరు వినే ఉంటారు కదా! వీడియో కాలింగ్ కు ఉపకరించే టెక్ పరికరాలలో స్కైప్ ఒకటి. దీని యజమాని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్.దీనిని కంప్యూటర్ ల లోనూ,లాప్ టాప్ ల లోనూ, స్మార్ట్ ఫోన్ లు మరియు టాబ్లెట్ లలోనూ ఉపయోగిస్తారు.అయితే మైక్రోసాఫ్ట్ యొక్క ఆపరేటింగ్ సిస్టం ను కలిగి ఉన్న పరికరాలలో మాత్రమే స్కైప్ యొక్క గ్రూప్ వీడియో కాలింగ్ అందుబాటులో ఉంటుంది. అంటే ఆండ్రాయిడ్,ios లాంటి ఆపరేటింగ్ సిస్టం లను కలిగి ఉన్న పరికరాలలో గ్రూప్ వీడియో కాలింగ్ ను స్కైప్ సహాయం తో ఉపయోగించలేము.అయితే ఈ పరిస్థితి ఇప్పుడు మారబోతోంది.మైక్రోసాఫ్ట్ స్కైప్ టీం యొక్క 10 వ వార్షికోత్సవం సందర్భంగా ఆండ్రాయిడ్,మరియు ios, విండోస్ 10 వినియోగదారులకు కూడా స్కైప్ లో గ్రూప్ వీడియో కాలింగ్ సౌకర్యం అందుబాటులోనికి తీసుకు రానున్నట్లు మంగళవారం ఈ సంస్థ ప్రకటించింది.స్కైప్ ఇప్పటికే వ్యాపార అవసరాలకు దానిని సబ్ స్క్రైబ్ చేసుకున్న వారికి గ్రూప్ వీడియో కాలింగ్ ను అందిస్తున్నది.అయితే తాజా ప్రకటనతో నాన్ –సబ్ స్క్రైబర్ లకు కూడా వీడియో కాలింగ్ అందుబాటులోనికి రానుంది.వినియోగదారులకు ఈ ఫీచర్ ఉచితంగానే లభించనుంది. ఒక వేల ఎవరైనా ప్రివ్యూ చూడాలనుకుంటే కొన్ని వివరాలను అందించి సైన్ అప్ అవడం ద్వారా ఈ గ్రూప్ కాలింగ్ యొక్క ప్రివ్యూ చూడవచ్చు. గ్రూప్ వీడియో కాలింగ్ లో రికార్డు స్థాయిలో ఒకేసారి 25 మంది మాట్లాడుకునే విధంగా తన కొత్త సేవలను సరికొత్త తరహాలో స్కైప్ ప్రారంభించింది.ఎందుకంటే ఈ రకమైన ఫీచర్ ను ఇప్పటివరకు ఈ కంపెనీ ఇవ్వలేదు. స్కైప్ యొక్క పోటీ కంపెనీ యాప్ అయిన గూగుల్ హాంగ్ అవుట్ కూడా వీడియో కాలింగ్ ను ఇస్తుంది.దాని పేరు పాప్ కార్న్ బజ్. కానీ దానిలో కేవలం 10 మంది మాత్రమే ఒకే సారి వీడియో కాలింగ్ లో పాల్గొనవచ్చు.వైబెర్,వే చాట్ లాంటి మిగతా కంపెనీ ల యాప్స్ కూడా గ్రూప్ వీడియో కాలింగ్ ను అందిస్తాయి కానీ స్కైప్ స్థాయి లో అవి ఇవ్వలేవు.ప్రముఖ చాటింగ్ యాప్ అయిన హైక్ గత సెప్టెంబర్ నెలలో ఒక ఆడియో చాటింగ్ యాప్ ను విడుదల చేసింది.దీనిలో ఒకేసారి 100 మంది వరకు చాటింగ్ చేసుకునే అవకాశం ఉన్నది.కానీ ఇది ఆడియో మాత్రమే కదా! మిగతా ప్రముఖ చాటింగ్ యాప్స్ అయిన ఫేస్ బుక్ టైం, ఫేస్ బుక్ మెసెంజర్ కూడా ఈ యాప్ ను స్వీకరించేందుకు సిద్దం గా ఉన్నాయి. స్కైప్ కంపెనీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ స్కైప్ ను ప్రారంభించిన తర్వాత గత పది సంవత్సరాలలో స్కైప్ యొక్క వినియోగదారులు అందరూ కలిసి వీడియో కాలింగ్ ద్వారా మొత్తం సుమారు 2 ట్రిలియన్ ల(200 కోట్ల) నిమిషాలను ఉపయోగించారు. ఈ మొత్తం సమయం తో ప్రపంచం లో ఉన్న బాలలందరూ స్కైప్ ను ఉపయోగించి 10 గంటల పాటు చదువుకోవచ్చు.ప్రపంచం లో ఉన్న ప్రతీ కుటుంబం అంతా కలిసి స్కైప్ లో 7 గంటల పాటు మాట్లాడుకోవచ్చు.అయినా ఇంకా చాలా చాలా ఎక్కువ సమయం మిగిలి పోతుంది.ఆ మిగిలి పోయిన సమయంతో ప్రపంచం లో ఉన్న జనాభానంతటినీ స్కైప్ ను ఉపయోగించి వీడియో ద్వారా ఒక గంట పాటు ఇంటర్ వ్యూ చేయవచ్చు. |