• తాజా వార్తలు

యాపిల్ వాచ్ కోసం.. కీచైన్ సైజ్‌లో అతి చిన్న వైర్‌లైస్‌ ఛార్జ‌ర్ 

టెక్నాల‌జీ పెరుగుతున్న కొద్దీ వేర‌బుల్ గ్యాడ్జెట్ల‌కు క్రేజ్ పెరుగుతోంది.  స్మార్ట్ వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాక‌ర్లు, డిజిట‌ల్ రింగ్స్ వంటివి ఈ కోవలోకే వ‌స్తాయి. ఇక యాపిల్ వాచ్ అయితే టెక్నాల‌జీప‌రంగా సూట‌బుల్ మాత్ర‌మే కాదు స్ట‌యిలిష్‌గా, లావిష్‌గా కూడా ఉంటుంది.  యాపిల్ వాచ్‌ను ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఒక రోజంతా వ‌స్తుంద‌ని యాపిల్ చెబుతోంది.  అయితే యూసేజ్ ఎక్కువ ఉంటే త్వ‌ర‌గానే అయిపోతోంది.  అలాగ‌ని యాపిల్ వాచ్ ఛార్జ‌ర్‌ను వెంట తీసుకెళ్ల‌డం ప్ర‌తిసారి కుద‌ర‌దు. అందుకే యాపిల్‌.. త‌న వాచ్ ఛార్జింగ్‌కు అల్ట్రా పోర్ట‌బుల్  వైర్‌లెస్ చార్జ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. Oittm  పేరుతో వ‌చ్చిన  ఈ ఛార్జ‌ర్ చాలా చిన్న‌దిగా, కీచైన్ సైజ్‌లో ఉంటుంది.  
 ఫీచ‌ర్స్ 
ఈ ఛార్జ‌ర్ యాపిల్ ఎంఎఫ్‌ఐ స‌ర్టిఫైడ్ మ్యాగ్న‌టిక్ యాపిల్ వాచ్ ఛార్జ‌ర్‌తో వ‌స్తుంది. దీనిలో ఉండే ఎంసీయూ మేనేజ్‌మెంట్  ఓవ‌ర్ క‌రెంట్‌, ఎలక్ట్రానిక్ క్వాంటిటీల్లో హెచ్చుత‌గ్గుల నుంచి యాపిల్ వాచ్‌ను ప్రొటెక్ట్ చేస్తుంది.  వైర్‌లైస్ ఛార్జ‌ర్ కావ‌డంతో ఎక్క‌డికైనా ఈజీగా తీసుకెళ్ల‌చ్చు. ఈజీగా ఛార్జింగ్ చేసుకోవ‌చ్చు.  దీనిలో 700 ఎంఏహెచ్ బ్యాట‌రీ ప‌వ‌ర్‌ను కూడా స్టోర్ చేసుకోవ‌చ్చు. ఈ ప‌వ‌ర్‌తో యాపిల్ వాచ్‌ను మ‌రో మూడు గంట‌లు అద‌నంగా న‌డిపించ‌వ‌చ్చు. 
ధ‌ర 2,500
యాపిల్ వాచ్ 1,2 సిరీస్‌ల‌కు  ఈ చార్జ‌ర్ ప‌ని చేస్తుంది. ధ‌ర మ‌న క‌రెన్సీలో చెప్పాలంటే 2,500 వ‌ర‌కు ఉంటుంది. అమెజాన్‌లో దొరుకుతుంది. 

జన రంజకమైన వార్తలు